Thackeray & Ambedkar: చేతులు కలిపిన థాకరే-అంబేద్కర్.. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ పొత్తు

ఈరోజు బాలాసాహేబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని కొంత మంది ప్రజలు కోరుకుంటున్నట్లు మేమిద్దరం ఒకతాటిపైకి రావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్, నేను పొత్తు కుదుర్చుకున్నాం. ఇది మహారాష్ట్ర ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మా తాత, ప్రకాష్ అంబేద్కర్ తాత (రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్) ఒకప్పుడు కలిసి పనిచేశారు

Thackeray & Ambedkar: చేతులు కలిపిన థాకరే-అంబేద్కర్.. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ పొత్తు

Thackeray & Ambedkar.. New Tie-Up Ahead Of Mumbai Civic Polls

Thackeray & Ambedkar: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పొత్తు పొడిచింది. పూర్తి వ్యతిరేక భావజాలాలు ఉన్న రెండు పార్టీలు చేతులు కలిపాయి. పూర్తి హిందుత్వ భావజాలం నడిచే శివసేన (ఉద్ధవ్ వర్గం), పూర్తిగా అంబేద్కర్ సిద్ధాంతాలతో నడిచే వంచిత్ బహుజన్ అగాడీ మధ్య ఈ పొత్తు ఏర్పడింది. వాస్తవానికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి పొత్తును ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే అక్కడ చాలా కాలంగా సమీప భావజాలమున్న పార్టీల మధ్యే పొత్తు కొనసాగుతూ వస్తోంది. దాన్ని బ్రేక్ చేసి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, వంచిత్ బహుజన్ అగాడీ అధినేత ప్రకాష్ అంబేద్కర్ పొత్తులోకి రావడం గమనార్హం.

UN warned Taliban : అఫ్ఘనిస్తాన్ లో మహిళలపై ఆంక్షలు.. తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్

ప్రకాష్ అంబేద్కర్‭తో ఉద్ధవ్ థాకరే రెండు నెలలుగా చర్చలు సాగిస్తున్న చర్చలు శివసేన వ్యవస్థపకుడు బాల్ థాకరే జన్మదినం (జనవరి 23) రోజున ఆచరణలోకి వచ్చాయి. ఈ విషయమై ఉద్ధవ్ మాట్లాడుతూ ‘‘ఈరోజు బాలాసాహేబ్ థాకరే జయంతి. మహారాష్ట్రలోని కొంత మంది ప్రజలు కోరుకుంటున్నట్లు మేమిద్దరం ఒకతాటిపైకి రావడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్, నేను పొత్తు కుదుర్చుకున్నాం. ఇది మహారాష్ట్ర ప్రజల ఐక్యతకు చిహ్నంగా ఉంటుంది. మా తాత, ప్రకాష్ అంబేద్కర్ తాత (రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్) ఒకప్పుడు కలిసి పనిచేశారు. ఆ సమయంలోనే వారు సామాజిక అంశాలపై పోరాటం చేశారు. వారిద్దరిదీ ఒక చరిత్ర. ఇప్పుడు వారి వారసత్వం కూడా సామాజిక న్యాయం కోసం పోరాటం చేయడానికి ఒక్కటయ్యాం’’ అని అన్నారు.

Revanth Reddy Comments: కర్ణాటక రాజకీయాల్లో బీఆర్ఎస్ చిచ్చు

ఇక ప్రకాష్ అంబేద్కర్ మాట్లాడుతూ ‘‘రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సామాజిక అంశాలపై పోరాటం చేయడం కోసం మేము చాలాసార్లు కలిసి పని చేశాం. ఈ సామాజిక పోరాటంలో మేము గెలుస్తామా లేదా అనేది ప్రజల చేతుల్లో ఉంది. కానీ మంచి వ్యక్తుల్ని ఎంపిక చేసి వారికి సీట్లు కేటాయించే అవకాశం రాజకీయ పార్టీలకు ఉంది. మేము అది నెరవేరుస్తాం’’ అని అన్నారు. అయితే ఈ పొత్తులో శరద్ పవార్ కూడా చేరతారా అని ప్రశ్నించగా దానికి పవార్ నుంచి ఎలాంటి స్పందన లేదని, అయితే ఆయన కూడా తప్పకుండా చేరతారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

Putin-Zelensky : ‘ పుతిన్ జీవించి ఉన్నారో లేదో ’ : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

వాస్తవానికి శివసేన ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో పొత్తులో ఉంది. అయినప్పటికీ ప్రకాష్ అంబేద్కర్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇది మహా వికాస్ అగాడీలో భాగం అయితే కాదు. కానీ, కొత్త పొత్తు కారణంగా మహా వికాస్ అగాడీ నుంచి ఉద్ధవ్ విడిపోతారా లేదంటే తనకు వచ్చిన సీట్లను ప్రకాష్ అంబేద్కర్‭తో పంచుకుంటారా అనేది తెలియాలి.