UN warned Taliban : అఫ్ఘనిస్తాన్ లో మహిళలపై ఆంక్షలు.. తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్

తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది.

UN warned Taliban : అఫ్ఘనిస్తాన్ లో మహిళలపై ఆంక్షలు.. తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్

Taliban

UN warned Taliban : తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్థితులను పరిశీలించింది. మహిళలు, బాలికల హక్కులను పరిరక్షణకు చొరవ చూపాలని తాలిబన్లను కోరింది. చదువులు, ఉద్యోగాల నుంచి మహిళలను దూరం చేస్తూ తాలిబన్ ప్రభుత్వం విధిస్తున్న నిషేదాజ్ఞలపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.

స్థానికంగా మానవతా సంక్షోభం నెలకొన్న వేళ ఈ ఆంక్షలు ఆఫ్ఘాన్ ను మరింత ఏకాకిని చేస్తాయని తెలిపింది. తమ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి తమ సంఘీభావం ప్రకటించింది. అధికారులతో చర్చలు జరిపింది. తమ పరిశీలనులు, సిఫారుసులను ఐరాస సభ్య దేశాలతో పంచుకోనుంది. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేపట్టిన నాటి నుంచి తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.

Taliban Government : అఫ్ఘానిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం.. మహిళలు యూనివర్సిటీల్లో చదవడం నిషేధం

ముఖ్యంగా మహిళల విద్యపై నిషేధాన్ని విధించిన తాలిబన్లు.. ఉద్యోగాలు చేయడం, యూనివర్సిటీలకు వెళ్లడం, ఎన్ జీవోలలో పని చేయడాన్ని కట్టడి చేశారు. దీనిపై స్థానిక మహిళలు ఆందోళనలు కూడా నిర్వహించారు. తాలిబన్ల నిర్ణయాలను అంతర్జాతీయంగా చాలా దేశాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ వాటిని తిరిగి కొనసాగించడం తమ ప్రాధాన్యం కాదని తాలిబాన్లు తెలిపారు.

హింస ఇస్లామిక్ చట్టాలను మహిళలు అతిక్రమించడం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని తాలిబన్లు స్పష్టం చేశారు. ఆఫ్ఘాన్ లోని మహిళల హక్కులపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాము వెనక్కి తగ్గేదేలే అనేదిగా తాలిబాన్లు వ్యవహరిస్తున్నారు. ఇస్లామిక్, షరియాకు అనుగుణంగా అన్ని విషయాలను నియంత్రిస్తున్నారని, షరియాకు వ్యతిరేకంగా ఏ పనిని కూడా తమ ప్రభుత్వం అనుమతించబోదని తాలిబన్లు స్పష్టం చేశారు.

Afghanistan : గడ్డం నుంచి గాలిపటాల వరకు.. తాలిబన్ ప్రభుత్వం ఏమేం బ్యాన్ చేసిందో తెలుసా

షరియా చట్టాల ప్రకారమే మహిళలపై ఆంక్షలు విధిస్తున్నామన్న తాలిబన్ల వాదనను ముస్లిం దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఖండించింది. మహిళల హక్కులను కాలరాయొద్దంటూ తాలిబన్లకు ఇటీవలే సూచనలు చేసింది. మహిళలు, బాలికల చదువు ఉద్యోగం లాంటి హక్కుల నుంచి దూరం చేయొద్దని చెప్పింది. అయితే తాలిబన్లు మాత్రం ఎవరి మాట వినేలా కనిపించం లేదు.