Kerala: కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు ఒక వ్యక్తి హత్య

రాయప్పన్(65) అనే వ్యక్తికి చుట్టుపక్కల ఇళ్లల్లోని కుక్కల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు ఈ విషయమై వారికి ఫిర్యాదు కూడా చేశాడు. ఇందులో భాగంగా తాజాగా డానియెల్ అనే వ్యక్తికి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే తమ కుక్కను కుక్క అని రాయప్పన్ పలకడం డానియెల్‭కు నచ్చలేదు. అలాగే కుక్కల్ని కట్టి ఉంచాలని చెప్పడం కూడా నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ వాగ్వివాదం జరిగేది.

Kerala: కుక్కను ‘కుక్క’ అని పిలిచినందుకు ఒక వ్యక్తి హత్య

Uttar Pradesh

Kerala: పెంపుడు జంతువుల్లో కుక్క అతి ముఖ్యమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రేజ్ ఏనాటి నుంచో ఉంది. కొందరైతే కుక్కల్ని తమ పెంపుడు జంతువుల్లాగ కాకుండా ఇంటి సభ్యులలాగే చూసుకుంటుంటారు. ముద్దు పేర్లు పెట్టుకుని ఆ పేర్లతోనే పిలుచుకుంటారు. ఎవరైనా వాటిని పేర్లతో పిలవకుండా కుక్క అంటే ఎక్కడలేని కోపం వస్తుంది. వారితో గొడవ పడుతుంటారు. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే. అయితే ఆయన మరీ విపరీతానికి వెళ్లి కుక్కను కుక్క అన్నందుకు ఒక వ్యక్తిని హతమార్చాడు. రాష్ట్రంలోని దిండిగుల్ జిల్లాలో జరిగిందీ ఘటన.

ICC Awards: ఐసీసీ పురుషుల టీ20 జట్టులో భారత్ ఆటగాళ్ల హవా.. టీమ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్

వివరాల్లోకి వెళితే.. రాయప్పన్(65) అనే వ్యక్తికి చుట్టుపక్కల ఇళ్లల్లోని కుక్కల కారణంగా ఇబ్బంది పడుతున్నాడు. చాలాసార్లు ఈ విషయమై వారికి ఫిర్యాదు కూడా చేశాడు. ఇందులో భాగంగా తాజాగా డానియెల్ అనే వ్యక్తికి కూడా ఫిర్యాదు చేశాడు. అయితే తమ కుక్కను కుక్క అని రాయప్పన్ పలకడం డానియెల్‭కు నచ్చలేదు. అలాగే కుక్కల్ని కట్టి ఉంచాలని చెప్పడం కూడా నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ వాగ్వివాదం జరిగేది.

Thackeray & Ambedkar: చేతులు కలిపిన థాకరే-అంబేద్కర్.. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ పొత్తు

ఇందులో భాగంగా గురువారం కుక్కల్ని కొట్టడానికి రాయప్పన్ కర్ర తీసుకున్నాడు. దీంతో తీవ్రంగా కోపానికి లోనైన డానియెల్ అతడి భార్య విన్సెంట్.. రాయప్పన్ మీదకు దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన రాయప్పన్ అపస్మారక స్థితిలోకి వెళ్లి అనంతరం మరణించాడు. తాడికొంబు పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్ట్ విచారిస్తామని వారు తెలిపారు.