ICC Awards: ఐసీసీ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టులో భారత్ ఆటగాళ్ల హవా.. టీమ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్

2022 సంవత్సరానికిగానూ 11మంది పురుషుల టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో భారత్ ఆటగాళ్లు ముగ్గురు చోటు దక్కించుకున్నారు.

ICC Awards: ఐసీసీ అత్యుత్తమ పురుషుల టీ20 జట్టులో భారత్ ఆటగాళ్ల హవా.. టీమ్ కెప్టెన్‌గా జోస్ బట్లర్

ICC Awards

ICC Awards: 2022 సంవత్సరానికిగానూ 11మంది పురుషుల టీ20 జట్టును అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఈ జట్టులో భారత్ ఆటగాళ్లు ముగ్గురు చోటు దక్కించుకున్నారు. అయితే, టీమ్‌కు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. ఈ జట్టులో టీమిండియా నుంచి అత్యధికంగా ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా‌లను ఐసీసీ ఎంపిక చేసింది. అయితే, టీమ్ కెప్టెన్‌గా  బట్లర్‌ను నియమించడం అన్నివిధాల సరైందని ఐసీసీ పేర్కొంది.

ICC Awards: సూర్యకుమార్ యాదవ్ మరో ఘనత.. ఐసీసీ టీ20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్

బట్లర్ 2022 సంవత్సరంలో టీ20 ఫార్మాట్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 160.41 స్ట్రైక్ రేట్‌తో 462 పరుగులు చేశాడు. జూన్ 2022లో ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్ తరువాత బట్లర్ ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌ను తన సారథ్యంలో విజేతగా నిలిపాడు. 2022 ఐసీసీ టీ20 జట్టులో ముగ్గురు భారత్ ఆటగాళ్లు ఎంపికకాగా.. ఇద్దరు పాకిస్థాన్ జట్టు నుంచి, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇద్దరు, న్యూజిలాండ్, జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ జట్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. భారత్ జట్టు నుంచి ఇద్దరు బ్యాటర్లు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ అవకాశం కల్పించింది.

 

ఐసీసీ 2022 పురుషుల టీ20 అత్యుత్తమ జట్టు ఇదే..

జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్ – ఇంగ్లాండ్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్థాన్), విరాట్ కోహ్లీ (ఇండియా), సూర్యకుమార్ యాదవ్ (ఇండియా), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్), సికందర్ రంజా (జింబాబ్వే), హార్ధిక్ పాండ్యా (ఇండియా), సామ్ కుర్రాన్ (ఇంగ్లండ్), వనిందు హసరంగా (శ్రీలంక), హరీస్ రౌఫ్ (పాకిస్థాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్).

 

ICC Woman Team

ICC Woman Team

ఐసీసీ మహిళల టీ20 ఉత్తమ జట్టును కూడా ప్రకటించింది. ఇందులో టీమిండియా క్రీడాకారిణులు నలుగురు చోటుదక్కించుకున్నారు. ఈ టీమ్‌కు న్యూజిలాండ్ క్రీడాకారిణి సోఫీ డివైన్ ఎంపికయ్యారు.

ఐసీసీ ఉత్తమ టీ20 మహిళా జట్టు ఇదే..

సోఫీ డివైన్ (కెప్టెన్, న్యూజిలాండ్), స్మృతి మంధాన (ఇండియా), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), యాష్ గార్డనర్ (ఆస్ట్రేలియా), తహిలా మెక్ గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదాదార్ (పాకిస్థాన్), దీప్తి శర్మ (ఇండియా), రిచా ఘోష్ (ఇండియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), ఇనోకా రణవీర (శ్రీలంక), రేణుకా సింగ్ (ఇండియా)