Pakistan Economic Crisis: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు .. పాక్‌ను గట్టెక్కించాలంటే షాబాజ్ ముందు మిగిలింది అదొక్కటే మార్గమా?

ప్రస్తుత పరిస్థితుల నుంచి పాకిస్థాన్‌ను గట్టెక్కించేందుకు ప్రధాని షాబాజ్ అహ్మద్ ముందు ఓ మార్గం ఉందట. కొత్త రుణంకోసం అంతర్జాతీయ దవ్ర్య నిధి (ఐఎంఎఫ్)ను అభ్యర్థించడం. అయితే, సౌదీ అరేబియా, యూఏఈల మాదిరిగా ఐఎంఎఫ్ అంత తేలిగ్గా రుణం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఇచ్చినా ...

Pakistan Economic Crisis: పాకిస్థాన్‌లో దారుణ పరిస్థితులు .. పాక్‌ను గట్టెక్కించాలంటే షాబాజ్ ముందు మిగిలింది అదొక్కటే మార్గమా?

Pakistan crisis

Pakistan Economic Crisis: పాకిస్థాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ద్రవ్వోల్బణం కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. గోధుమల కొరత కారణంగా పిండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పిండి సరఫరా సరిపడా లేకపోవటంతో గోధుమ పిండికోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మాంసం, పాలు, నూనె, కూరగాయలతో పాటు ఇతర ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడంతో ప్రజలుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలోని వేలాది కుటుంబాలు పస్తులుంటున్న పరిస్థితి నెలకొంది. పాక్ విదేశీ మారక దవ్ర్య నిల్వలు 2014 సంవత్సరం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. ఆ దేశంలో మూడు వారాల పాటు దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి.

Pakistan Economic Crisis: ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్ నిల్వ.. పాక్‌లో దారుణ పరిస్థితులు.. వీడియోలు వైరల్

పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ ) నుంచి రుణం తీసుకుంది. అయినప్పటికీ ఆ దేశంలో పరిస్థితులు మెరుగు పడటం లేదు. ఈ క్రమంలో ఆ దేశ ప్రధాని షాబాజ్ అహ్మద్ ఆర్థిక సాయంకోసం పలు దేశాలను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఆ దేశంలో నగదు కొరత కారణంగా షిప్పింగ్ ఏజెంట్లు కూడా తమ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించాయి. ఈ పరిస్థితే తలెత్తితే దేశ ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా ఆ దేశంలో సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి.

Pakistan: పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం

ప్రస్తుత పరిస్థితుల నుంచి పాకిస్థాన్‌ను గట్టెక్కించేందుకు ప్రధాని షాబాజ్ అహ్మద్ ముందు ఓ మార్గం ఉందట. కొత్త రుణంకోసం అంతర్జాతీయ దవ్ర్య నిధి (ఐఎంఎఫ్)ను అభ్యర్థించడం. అయితే, సౌదీ అరేబియా, యూఏఈల మాదిరిగా ఐఎంఎఫ్ అంత తేలిగ్గా రుణం ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ఇచ్చినా ఐఎంఎఫ్ నిర్దేశించిన షరతులను నెరవేర్చడం కూడా షాబాజ్ ప్రభుత్వానికి కష్టంగానే ఉంటుంది. ఒకవేళ బలవంతంగా ప్రజలపై భారంమోపి ఐఎంఎఫ్ షరతులు నెరవేర్చే ప్రయత్నం చేసినా షాబాజ్ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి.