Pakistan Economic Crisis: ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్ నిల్వ.. పాక్‌లో దారుణ పరిస్థితులు.. వీడియోలు వైరల్

వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజమే.. పాకిస్థాన్ దేశంలో వంటగ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నింపుకొని తీసుకెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్, ఫఖ్తున్ఖ్వాలోని ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లలో ఎల్‌పీజీని నింపుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు.

Pakistan Economic Crisis: ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్ నిల్వ.. పాక్‌లో దారుణ పరిస్థితులు.. వీడియోలు వైరల్

Pakistan

Pakistan Economic Crisis: పాకిస్థాన్‌ను ఆర్థిక కష్టాలు వేధిస్తున్నాయి. ఆ దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. పాక్‌లోని  ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ప్రజలు ఎల్‌పీజీ గ్యాస్ నిల్వ చేయడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే.. సరఫరా కొరత మధ్య దేశంలో వంటగ్యాస్ సిలిండర్లు లేకపోవటమే కారణంగా తెలుస్తోంది. ప్లాస్టిక్ కవర్లలో వంటగ్యాస్ ను నింపి తీసుకెళ్లే వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Pakistan flag: ఉత్తరాఖండ్‌లో పాకిస్థాన్ జెండా, బ్యానర్ల కలకలం

స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో, కరాక్ ప్రాంతంలో 2007 నుంచి గ్యాస్ కనెక్షన్లు అందించలేదు. అయితే హంగు నగరం గత రెండేళ్లుగా గ్యాస్ కనెక్షన్లు వినియోగించడం లేదు. ఇదిలాఉంటే గ్యాస్ విక్రేతలు ఒక నాజిల్, వాల్వ్ తో కవర్ ముందు భాగాన్ని మూసివేసే ముందు ప్లాస్టిక్ బ్యాగ్ లోకి పైపు సాయంతో ఎల్‌పీజీ గ్యాస్‌ను నింపుతారు. ఒక ప్లాస్టిక్ సంచిలో మూడు నుంచి నాలుగు కిలోల గ్యాస్ నింపేందుకు గంట సమయం పడుతుందని స్థానిక మీడియా వెల్లడించింది.

 

భారీ సైజులోఉన్న కవర్లలో అత్యంత ప్రమాదకరంగా వంట గ్యాస్ నింపుకొని ఈడ్చుకెళ్తున్నట్లు వీడియోలో ఉంది. తాజా వీడియోలతో పాక్ అధికారులు అప్రమత్తమైనట్లు, ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు పాక్ మీడియా పేర్కొంది. తీవ్ర ద్రవ్వోల్బణంతో పాటు, పెట్రోలియం, గ్యాస్ నిల్వలు తగ్గిపోవడం, దీనికితోడు కరెన్సీ విలువ పతనం వంటి సమస్యలు పాకిస్థాన్ ను వెంటాడుతున్నాయి. దీంతో సబ్సిడీ భారాన్ని మోయలేక చాలా వాటికి కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అక్కడ అనేక ప్రాంతాలను వంట గ్యాస్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.