భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషమన్న ప్రధాని మోదీ

భగవద్గీతకు యునెస్కో గుర్తింపు లభించింది. భగవద్గీతతో పాటు భారతముని రాసిన నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. వీటికి యునెస్కో ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది.

Bhagavad Gita

Narendra Modi: భగవద్గీత, భరతముని రచించిన నాట్య శాస్త్రానికి అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతీ భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు.

 

‘‘భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో లిఖించబడ్డాయి. భారతీయ నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది అంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ‘ఎక్స్’ఖాతాలో పేర్కొన్నారు. యునెస్కో గుర్తింపునకు సంబంధించిన పత్రాలను షేర్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ హర్షం వ్యక్తంచేశారు.

 

‘‘ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన విషయం. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన జ్ఞానం సంపద, సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా లభించిన ఘనమైన గుర్తింపు. భగవత్ గీత మరియు నాట్యశాస్త్రం శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.’’ అని మోదీ పేర్కొన్నారు.