Bharat Bandh : ఈ నెల 25న భారత్ బంద్.. డిమాండ్స్ ఇవే..

ఈ నెల 25న భారత్ బంద్ కు ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది.

Bharat Bandh : ఈ నెల 25న భారత్ బంద్ కు ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించకపోవడానికి నిరసనగా.. పలు డిమాండ్లతో బంద్ చేపట్టనుంది.

ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, రైతులకు కనీస మద్దతు ధర, పాత పెన్షన్ విధానం అమలు, ఎన్ ఆర్సీ, సీఏఏ, ఎన్ పీఆర్ ఉపసంహరణ వంటి డిమాండ్ల సాధన కోసం బంద్ చేపట్టనున్నట్లు ఫెడరేషన్ నేతలు తెలిపారు. భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని వారు ప్రజలను కోరారు.

Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?

భారత్ బంద్‌ పిలుపునకు కారణాలు, డిమాండ్లు ఇవే…
* కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టని కేంద్రం
* ఈవీఎం కుంభకోణం
* ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలుకు డిమాండ్
* రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చేయాలి

* NRC/CAA/NPRకి వ్యతిరేకంగా
* పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్
* మధ్యప్రదేశ్, ఒడిశా పంచాయితీ ఎన్నికల్లో OBC రిజర్వేషన్లలో ప్రత్యేక ఓటర్లు అమలు చేయాలి
* పర్యావరణ పరిరక్షణ పేరుతో గిరిజన నిర్వాసితులకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలకు నిరసనగా
* టీకాపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా
* లాక్‌డౌన్‌లో రహస్యంగా కార్మికులపై చేసిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన

మే 25న తాము చేపట్టబోయే బంద్ కు మద్దతుగా వ్యాపారాలు, ప్రజా రవాణాను మూసివేయాలని ఫెడరేషన్ నేతలు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు