Bharat Bandh tomorrow: శుక్రవారం ఉదయం 6గంటల భారత్ బంద్

రైతు యూనియన్ల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) శుక్రవారం భారత్ బంద్ కోసం పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు కొత్త చట్టాల అమలుపై చేస్తున్న ఆందోళన నాలుగు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో..

Bharat Bandh tomorrow: రైతు యూనియన్ల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) శుక్రవారం భారత్ బంద్ కోసం పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు కొత్త చట్టాల అమలుపై చేస్తున్న ఆందోళన నాలుగు నెలలు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో 26 మార్చి 2021న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ నిర్వహించనున్ారు.

బంద్ జరుగుతున్న సమయంలో రోడ్, రైలు ట్రాన్స్‌పోర్ట్, మార్కెట్స్, ఇతర పబ్లిక్ ప్లేసులు మూసే ఉంటాయి. రైతు నాయకులు బుటా సింగ్ బుర్జ్ గిల్ మాట్లాడుతూ.. ‘మార్చి 26న పూర్తి స్థాయి బంద్ జరగాలని అనుకుంటున్నాం. కొత్త వ్యవసాయ చట్టాలపై నాలుగు నెలలు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.

దాంతో పాటుగా హోలికా దహన్ మార్చి 28న కొత్త రైతు చట్టాలకు సంబంధించిన కాగితాలను దహనం చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మార్చి 26న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం బంద్ మినహాయించినట్లు తెలిపారు. ఈ మేరకు దేశ ప్రజలు ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ శుక్రవారం జరగనున్న భారత్ బంద్ కు సపోర్ట్ తెలిపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయానికి నిరసన వ్యక్తం చేయనుంది.

ట్రెండింగ్ వార్తలు