Covaxin
Bharat Biotech: కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా.. కొత్త వేరియంట్లతో విజృంభిస్తూ కలవరపెడుతోంది. కరోనాపై యుద్ధానికి ఇప్పటికే వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోండగా.. ఇప్పటికే అర్హులైనవారికి రెండు డోసుల వ్యాక్సిన్ దాదాపుగా అందించింది కేంద్ర ప్రభుత్వం.
లేటెస్ట్‌గా భారత వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో కీలక అడుగు వేసింది భారత్ బయోటెక్ కంపెనీ. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్నవారికే వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండగా.. ఇకపై 12 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను 12-18 ఏళ్ల వయసు వారికి అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చు అంటూ అనుమతులు ఇచ్చింది డీసీజీఐ.