Dives Under Moving Train: కదులుతున్న రైలు కిందకు దూరి బాలికను కాపాడిన వ్యక్తి

ఫ్యాక్టరీ నుంచి తిరిగొస్తుండగా రైలు పట్టాల మీద పడిపోయిన చిన్నారిని కాపాడేందుకు ఆ వ్యక్తి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వృత్తి రీత్యా కార్పెంటర్ అయిన మెహబూబ్ ఫిబ్రవరి 5 సాయంత్రం

Bhopal

Dives Under Moving Train: ఫ్యాక్టరీ నుంచి తిరిగొస్తుండగా రైలు పట్టాల మీద పడిపోయిన చిన్నారిని కాపాడేందుకు ఆ వ్యక్తి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. వృత్తి రీత్యా కార్పెంటర్ అయిన మెహబూబ్ ఫిబ్రవరి 5 సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి తిరిగొస్తున్నాడు. భోపాల్ లోని బార్ఖేడీ ప్రాంతంలో కొందరు పాదచారులు పట్టాలు దాటుతున్నారు.

అదే సమయంలో గూడ్స్ ట్రైన్ వస్తుంది. ట్రైన్ ను చూసి ఆగిపోయి అది వెళ్లేంతవరకూ వెయిట్ చేస్తున్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక చిన్నారి పట్టాలమీద పడిపోయింది. బాలిక సమీపంలోకి వచ్చేసిన రైలు ఆమెపై నుంచి వెళ్లబోయింది. క్షణాల్లో పట్టాల మీదకు దూకిన మొహమూద్ మెహబూబ్ ప్రాణాలకు తెగించి బాలికను కాపాడేందుకు సిద్ధమయ్యాడు.

కదిలే ట్రైన్ కిందకు దూరి బాలికవైపుగా పాకుకుంటూ వెళ్లాడు. బాలికను రైలు పట్టాల మధ్యగా ఉండేలా చూసి తల పైకి ఎత్తకుండా చూశాడు. బాలికతో పాటే తాను కూడా తలను నేలలోకి ఆనించి ఉంచుకున్నాడు. రైలు వెళ్లేంతవరకూ అలాగే ఉండిపోయి బాలిక ప్రాణాలను కాపాడాడు.

Read Also : ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీ

 

అతని వీరోచిత ప్రదర్శనకు స్థానికులు, సోషల్ మీడియా వీడియోను షేర్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.