దేశంలో తమిళనాడు, ఢిల్లీ తరువాత 2,38,461 కోవిడ్ -19 కేసులతో మహారాష్ట్ర అత్యధిక కోవిడ్ కేసులు ఉన్న రాష్ట్రంగా కొనసాగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబచ్చన్ కి కరోనా పాజిటివ్ సోకటంతో ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమితాబ్ చికిత్సకి సానుకూలంగా స్పందిస్తున్నారు. భయపడాల్సిందే ఏమి లేదు. రాత్రి ఆయన ప్రశాంతంగా నిద్ర పోయారని నానావతి ఆసుపత్రికి చెందిన వైద్యుడు డాక్టర్ అన్సారీ పేర్కొన్నారు. బిగ్ బీ కాలేయ, ఉదర సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నారు.
అమితాబ్‌తో పాటు అభిషేక్ కూడా కరోనా బారిన పడడంతో వారిద్దరు త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ ట్విట్టర్ ద్వారా ఆకాంక్షిస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ, నాగార్జున, అనుపమ్ ఖేర్, పరేష్, రావల్, సచిన్ టెండూల్కర్, రితేష్ దేశ్ ముఖ్, పరిణితీ చోప్రా తదితరులు అమితాబ్ కరోనా నుండి త్వరగా కోలుకొని సురక్షితంగా ఇంటికి చేరుకుంటారని భావిస్తున్నారు. కాగా, జయా బచ్చన్, ఆరాధ్య,ఐశ్వర్యరాయ్‌లకి రిపోర్ట్స్‌లో నెగెటివ్ వచ్చిన విషయం విదితమే