Nitish Kumar Basavaraj Bommai : దేశంలో కోవిడ్ టెర్రర్.. బీహార్, కర్నాటక సీఎంలకు కరోనా పాజిటివ్

దేశంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి.

Nitish Kumar Basavaraj Bommai : దేశంలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. కోవిడ్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు పెరుగుతున్నాయి. దాంతో పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశంలో థర్డ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కొవిడ్‌ బాధితుల ఆస్పత్రి చేరికలు 5 నుంచి 10శాతం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రానున్న రోజుల్లో ఆస్పత్రి చేరికలు వేగంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన ఆస్పత్రి పడకలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం.

Covid-19: జలుబు వచ్చిందా.. కొవిడ్ నుంచి ప్రొటెక్షన్ వచ్చినట్లే

మరోవైపు ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది. బీహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కరోనా బారినపడ్డారు. డాక్టర్ల సలహా మేరకు ఆయన తన నివాసంలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

కర్నాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

మరోవైపు, కర్నాటకలో ఒక్కరోజే 11,698 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో నలుగురు మృతి చెందారు. కొవిడ్ బాధితుల్లో తాజాగా 1148 మంది కోలుకున్నారు. కర్నాటకలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 60,148కి పెరిగింది.

ICICI Credit Card : క్రెడిట్ కార్డు యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ఛార్జీలు

దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే రాజ్‌నాథ్‌ సింగ్‌, నిత్యానంద్‌ రాయ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు కొవిడ్ బారినపడగా.. తాజాగా మరో కేంద్రమంత్రి అజయ్‌ భట్‌ కి మహమ్మారి సోకింది. స్వల్ప లక్షణాలే ఉన్నాయని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన వెల్లడించారు. తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు