CM Nitish Kumar: సోనియాతో భేటీ కానున్న బిహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ కానున్నారు. ఈ నెల 25న వారు సోనియాను కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చిస్తారు.
- Narender Thiru
- Published On : September 23, 2022 / 08:03 AM IST
CM Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఈ నెల 25న వారు ఢిల్లీలోని సోనియా నివాసంలో ఆమెను కలుస్తారు.
Ban on Plastic flexies in AndhraPradesh: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం.. నోటిఫికేషన్ జారీ
ప్రధాని కావాలన్న ఆకాంక్షతో నితీష్ పని చేస్తున్నట్లు తెలిసిందే. దీనికోసమే ప్రతిపక్షాలను ఏకం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నితీష్ ఇటీవలే ఢిల్లీలో పర్యటించారు. మూడు రోజులు ఢిల్లీలో గడిపిన నితీష్ అక్కడ రాహుల్ గాంధీ, సీతారాం యేచూరి, డా.రాజా, అరవింద్ కేజ్రీవాల్, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ వంటి పలువురు నేతలను కలిశారు. అయితే, ఆ సమయంలో సోనియా గాంధీ ఢిల్లీలో లేరు.
PFI: 15 రాష్ట్రాలు, 93 ప్రదేశాల్లో ఎన్ఐఏ ముమ్మర సోదాలు.. 45 మంది అరెస్ట్
అందుకే తాజాగా సోనియాను కలవాలని నితీష్ నిర్ణయించుకున్నారు. అక్కడ సోనియాతో భేటీ తర్వాత నితీష్ హరియాణాలోని ఫతేహాబాద్ వెళ్తారు. అక్కడ మాజీ ఉప ప్రధాని చౌదురి దేవి లాల్ జయంతిలో పాల్గొంటారు. అక్కడ ప్రత్యేక ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీకి ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
