PFI: 15 రాష్ట్రాలు, 93 ప్రదేశాల్లో ఎన్ఐఏ ముమ్మర సోదాలు.. 45 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ ఈ విధమైన కార్యకలాపాలు చేపట్టిందని ఎన్ఐఏ చెబుతోంది. అన్నీ చోట్ల స్థానిక చైర్మన్ స్థాయి వ్యక్తులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 18 మందిని ఢిల్లీ కోర్టులో హాజరు పరిచిన ఎన్ఐఏ.. మిగిలిన వారిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరెస్ట్ చేసిన వారిని హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టులో హాజరు పర్చనున్నారు.

PFI: 15 రాష్ట్రాలు, 93 ప్రదేశాల్లో ఎన్ఐఏ ముమ్మర సోదాలు.. 45 మంది అరెస్ట్

NIA raided 93 locations in 15 states and 45 arrested

PFI: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే రాజకీయ పార్టీకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు గుప్పుమనడంతో గురువారం దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈనెల 26న హైదరాబాద్ ఎన్ఐఏ నమోదు చేసిన కేసు ఆధారంగా సోదాలు నిర్వహించిన ఈ దర్యాప్తు సంస్థ, సుమారు 100 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీలో అరెస్ట్ చేసిన పీఎఫ్ఐ నేతలను పాటియాలా హౌస్ ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వీరిని నాలుగు రోజులు ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తున్నట్లు పటియాలా హౌస్ కోర్ట్ తీర్పు వెలువరించింది.

మొత్తం దేశంలో 15 రాష్ట్రాల్లోని 93 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. కేరళ 39, తమిళనాడు 16, కర్ణాటక 12, ఆంధ్రప్రదేశ్ 7, తెలంగాణ 1, యూపీ 2, రాజస్థాన్ 4, ఢిల్లీ 2, అస్సాం 1, మధ్యప్రదేశ్ 1, మహారాష్ట్ర 4, గోవా 1, పశ్చిమబెంగాల్ 1, బీహార్ 1, మణిపూర్ 1 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సోదాలు కొనసాగాయి. నిజామాబాద్‭లో అబ్దుల్ రహీం, అబ్దుల్ వాహిద్ అలీ, అబ్దుల్ వారిస్, రియాజ్ అహ్మద్, షేక్ గఫుల్లాలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం, ఆయుధ శిక్షణ, ఉగ్రవాద భావజాలం వ్యాప్తి చేయడం, నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సాహించడం వంటి కార్యకలాపాల చేపట్టినట్లు రుజురు కావడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

Congress President Election: రాహుల్ తప్పుకోవడంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పెరుగుతోన్న పోటీ

దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ ఈ విధమైన కార్యకలాపాలు చేపట్టిందని ఎన్ఐఏ చెబుతోంది. అన్నీ చోట్ల స్థానిక చైర్మన్ స్థాయి వ్యక్తులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 18 మందిని ఢిల్లీ కోర్టులో హాజరు పరిచిన ఎన్ఐఏ.. మిగిలిన వారిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అరెస్ట్ చేసిన వారిని హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టులో హాజరు పర్చనున్నారు.

గతంలో పీఎఫ్ఐపై నమోదైన కేసుల్లో 355 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. వీరిలో 45 మంది దోషులని ఎన్ఐఏనే నిరూపించింది. ఈ ఏడాది జులైలో నిజామాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసును ఆగస్టు 26న ఎన్ఐఏ(హైదరాబాద్) స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టింది. అయితే ఇప్పటి వరకు పీఎఫ్ఐ సంస్థపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం గమనార్హం. కానీ, పీఎఫ్ఐలో పని చేస్తున్న నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై అనేక కేసులు నమోదు అవుతున్నాయి.

Hijab Row: హిజాబ్ వివాదంపై విచారణ ముగించి, తీర్పు రిజర్వులో పెట్టిన సుప్రీంకోర్టు