Hijab Row: హిజాబ్ వివాదంపై విచారణ ముగించి, తీర్పు రిజర్వులో పెట్టిన సుప్రీంకోర్టు

అసలు ప్రశ్న హిజాబ్ ధారణ ఇస్లాం మతాచారాల్లో ముఖ్యమైనదా? మతాన్ని అవలంబించే స్వేచ్ఛ, సంస్కృతి, వ్యక్తిగత గోప్యత, హుందాతనం హక్కుకు సంబంధించిన రాజ్యాంగపరమైన ప్రశ్నలు కోర్టు ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మతపరమైన వివరణ అవసరం కాబట్టి, ఈ పిటిషన్లపై విచారణను తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని ముస్లిం పిటిషనర్లు కోరారు. శబరిమల, ఇతర మతపరమైన సమస్యలను ఈ విధంగానే అప్పగించారని తెలిపారు.

Hijab Row: హిజాబ్ వివాదంపై విచారణ ముగించి, తీర్పు రిజర్వులో పెట్టిన సుప్రీంకోర్టు

Supreme Court reserves judgment on hijab ban

Hijab Row: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ ముగిసింది. అయితే ఈ వివాదంసై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా నేతృత్వంలోని దేశ అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ల తరపున 20 మందికిపైగా న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీనియర్ అడ్వకేట్లు రాజీవ్ ధావన్, కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్, దేవదత్ కామత్, సంజయ్ హెగ్డే తదితరులు వీరిలో ఉన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఏఎస్‌జీ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ నవడ్గి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.

సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే ముస్లిం పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తూ, వీథుల్లో నిరసనలను రెచ్చగొట్టేందుకు కుట్ర జరిగిందని, దానిలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ప్రమేయం ఉందని సొలిసిటర్ జనరల్ చెప్పడాన్ని విమర్శించారు. అనవసరమైన విషయాన్ని సొలిసిటర్ జనరల్ లేవనెత్తారని చెప్పారు. మీడియాలో విద్వేష ప్రసంగాలు, సెన్సేషనలిజంపై సుప్రీంకోర్టులోని వేరొక ధర్మాసనం బుధవారం జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించారు. ప్రస్తుతం ధర్మాసనం ముందు ఉన్న ప్రశ్న రాజ్యాంగ హక్కులకు సంబంధించినదని తెలిపారు. ఇటువంటి సమయంలో సొలిసిటర్ జనరల్ లేవనెత్తిన అంశం ప్రతికూల అభిప్రాయాన్ని సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సర్క్యులర్‌ను తానే ఉపసంహరించుకోవచ్చుని అన్నారు.

అసలు ప్రశ్న హిజాబ్ ధారణ ఇస్లాం మతాచారాల్లో ముఖ్యమైనదా? మతాన్ని అవలంబించే స్వేచ్ఛ, సంస్కృతి, వ్యక్తిగత గోప్యత, హుందాతనం హక్కుకు సంబంధించిన రాజ్యాంగపరమైన ప్రశ్నలు కోర్టు ముందు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మతపరమైన వివరణ అవసరం కాబట్టి, ఈ పిటిషన్లపై విచారణను తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని ముస్లిం పిటిషనర్లు కోరారు. శబరిమల, ఇతర మతపరమైన సమస్యలను ఈ విధంగానే అప్పగించారని తెలిపారు.

Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్‭ను కలిసిన ముస్లిం నేతలపై మండిపడ్డ ఓవైసీ