Ban on Plastic flexies in AndhraPradesh: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం.. నోటిఫికేషన్ జారీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీ, దిగుమతికి అనుమతి లేదని నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనపై కూడా నిషేధం వర్తిస్తుంది. ఆదేశాల అమలుకు నగరాలు, పట్టణాల్లో అధికారులు బాధ్యత తీసుకోవాలని చెప్పింది. నిబంధనలను అతిక్రమిస్తే ఫ్లెక్సీకి వంద రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

Ban on Plastic flexies in AndhraPradesh
Ban on Plastic flexies in AndhraPradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల తయారీ, దిగుమతికి అనుమతి లేదని నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనపై కూడా నిషేధం వర్తిస్తుంది. ఆదేశాల అమలుకు నగరాలు, పట్టణాల్లో అధికారులు బాధ్యత తీసుకోవాలని చెప్పింది.
గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే ఫ్లెక్సీకి వంద రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిషేధం అమలును పోలీస్, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని చెప్పింది. ప్లాస్టిక్ బదులుగా కాటన్, నేత వస్త్రాలు వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.