×
Ad

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ రౌడీ సినిమా సీన్.. జైలు నుంచి విక్టరీ.. అనుచరులు రచ్చరచ్చ

గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన అనంత్ కుమార్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.

Anant Kumar Singh

Anant Kumar Singh: మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో ఆ హీరో జైలు నుంచే శాసనసభకు పోటీ చేసి గెలుస్తాడు. ఇటువంటి సీనే బిహార్‌ ఎన్నికల్లో జరిగింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నాయకుడు అనంత్ కుమార్ సింగ్.. మొకామా నియోజకవర్గం నుంచి గెలిచారు.

ఆయన ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిని 28,206కు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన అనంత్ కుమార్ సింగ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. (Anant Kumar Singh)

Also Read: బిహార్‌లో మహాఘట్‌బంధన్ అట్టర్ ఫ్లాప్ షోకి 10 కారణాలు.. మరీ ఇంత ఘోరమా?

ఈ నెల 2న తెల్లవారుజామున జన సురాజ్ పార్టీ పోలింగ్ వర్కర్ దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అరెస్టయి అనంత్‌ కుమార్‌ సింగ్ జైలులో ఉన్నారు.అనంత్ కుమార్ సింగ్ అనుచరులు రిజల్ట్స్‌కు ముందే పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించి రచ్చ రచ్చ చేశారు.

“జైలు గేట్లు కూలతాయి.. మా సింహం వస్తోంది” అంటూ పోస్టర్లలో రాశారు. అనంత్ సింగ్ మీద ఏకంగా 28 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2005లో తొలిసారి అనంత్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆయన గెలవడం ఆరోసారి. ఆయనకు పార్టీలు మారడం అంటే చాలా ఇష్టం. కొన్నేళ్లు ఆర్జేడీలో, కొన్నేళ్లు జేడీయూలో ఉంటారు.