బిహార్‌లో మహాఘట్‌బంధన్ అట్టర్ ఫ్లాప్ షోకి 10 కారణాలు.. మరీ ఇంత ఘోరమా?

కాంగ్రెస్ బిహార్‌ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైంది. కీలక స్థానాల్లో కూడా దెబ్బతింది. కాంగ్రెస్‌ ఏకంగా 61 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.

బిహార్‌లో మహాఘట్‌బంధన్ అట్టర్ ఫ్లాప్ షోకి 10 కారణాలు.. మరీ ఇంత ఘోరమా?

Updated On : November 14, 2025 / 4:51 PM IST

Mahagathbandhan: బిహార్‌‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మహాఘట్‌బంధన్‌ ఘోరంగా ఓడిపోయింది. బిహార్‌లో 243 స్థానాలకు ఎన్నికలు జరిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకైనా/కూటమికైనా కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం. ఎన్డీఏ 200కు పైగా స్థానాల్లో విజయం దిశగా వెళుతోంది.

మహాఘట్‌బంధన్‌ (ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్‌, వీఐపీ) ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు ఇవే..

సీట్ల షేరింగ్‌లో గందరగోళం 
మహాఘట్‌బంధన్‌లో రాష్ట్రీయ జనతా దళ్‌ 143, కాంగ్రెస్‌ 61, సీపీఐ 9, సీపీఎం 4, సీపీఐ(ఎం-ఎల్)ఎల్‌ 20, వికాస్‌శీల ఇన్సాన్‌ పార్టీ 15 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఈ పార్టీలు సీట్ల సర్దుబాటులో తర్జన భర్జనపడ్డాయి. కొన్ని స్థానాల్లోనైతే ఫ్రెండ్లీ ఫైట్స్‌కు దిగాయి. మహాఘట్‌బంధన్‌లోని పార్టీల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో ఆ కూటమిని ఓటర్లు బలహీన కూటమిగా చూశారు. (Mahagathbandhan)

బలహీన నాయకత్వం
తేజస్వీ యాదవ్ బిహార్‌లో పెద్ద లీడరే అయినప్పటికీ మోదీ, నితీశ్ కుమార్‌లా ప్రజల్లో అంతటి ప్రభావం చూపించే నేత కాదు. అంతేగాక, సీఎం అభ్యర్థి మీద కూడా కూటమిలో భిన్నాభిప్రాయాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్
కాంగ్రెస్ బిహార్‌ ఎన్నికల్లో పూర్తిగా విఫలమైంది. కీలక స్థానాల్లో కూడా దెబ్బతింది. కాంగ్రెస్‌ ఏకంగా 61 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వారిలో నలుగురు గెలవడం కూడా గగనమైపోయింది. ఓటర్లను సమీకరించడంలో ప్రభావం చూపలేదు. కాంగ్రెస్‌లో కొందరికి తగిన ప్రాధాన్యం రాలేదన్న భావన పెరిగింది.

చిన్న మిత్రపక్షాలతో విభేదాలు
వికాశీల్ ఇన్సాన్ పార్టీ ఏకంగా 15 స్థానాల్లో పోటీ చేసింది. ఇటువంటి చిన్న పార్టీలు తమకున్న బలం కన్నా ఎక్కువ సీట్లు, అధికార భాగస్వామ్యాన్ని కోరాయి. ఈ పరిస్థితులు ప్రచారానికి అడ్డుగా నిలిచాయి. ఉదాహరణకు జేఎంఎం కూటమి నుంచి దూరమవడం అస్థిరతను బయటపెట్టింది.

ప్రజల సమస్యలను లేవనెత్తడంలో లోపం
సర్వేల్లో బిహార్ ప్రజలు లా, ఐడెంటిటీ, జాబ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వీటిపై మహాఘట్‌బంధన్‌ సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేదు.

ఆర్జేడీ పాత ఇమేజ్ (జంగిల్ రాజ్)
ఆర్జేడీ పాత ఇమేజ్‌ (జంగిల్ రాజ్)ను పోగొట్టడంలో తేజస్వీ విఫలమయ్యారు. ఆర్జేడీ వస్తే మళ్లీ “జంగిల్ రాజ్” వస్తుందన్న భయాన్ని ఎన్డీఏ నేతలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. అది ఆ కాలంలో జరిగిన నేరాలు, పాలన వైఫల్యాలు, అవినీతి భయాలను గుర్తుచేసింది.

ప్రచారంలో బలం ఏది?
బలహీనకరమై రీతిలో మహాఘట్‌బంధన్‌ పార్టీలు ప్రచారం చేశాయి
గ్రామీణ స్థాయిలో ప్రచారాన్ని నిదానంగా ప్రారంభించింది
చివరి దశల్లో ఎన్డీఏ వేగంగా దూసుకెళ్లగా, మహాఘట్‌బంధన్‌లో అది కనిపించలేదు

ఓట్ల చీలిక
ప్రశాంత్ కిశోర్ “జన సురాజ్” పోటీకి దిగడంతో ప్రతిపక్ష పార్టీల ఓట్లను చీల్చింది. ఎన్నికల వేళ ఇవ్వాల్సిన సందేశాలను సరిగ్గా ఇవ్వలేకపోయింది. డిజిటల్ వేదికలపై మహాఘట్‌బంధన్‌ బలంగా లేదు.

ఇంకా..
కూటమి స్ఫూర్తి కన్నా నేతల అవకాశవాదమే అధికంగా ప్రజలకు కనిపించడం
విలువల ఆధారంగా ఏర్పడిన కూటమి కాకుండా, లాభాల కోసం కూటమిలా కనిపించిందనే ప్రజల్లో అభిప్రాయం పెరిగింది
అంతర్గత పోరు విశ్వసనీయతను దెబ్బతీసింది
అంతా ఏకమై ఎన్డీఏను ఎదిరించాల్సిన చోట విభేదాలు బయటపడ్డాయి