Bihar: నిద్రిస్తున్న రైతులపై విరుచుకపడ్డ పోలీసులు.. తీవ్ర ఆగ్రహంలో బిహార్‭ రైతులు

చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ సేకరించిన భూముల వ్యవహారంపై రెండు నెలలుగా రైతులు నిరసన చేస్తున్నారు. కంపెనీ గేటు బయటే నిరాహార దీక్ష చేపట్టిన రైతులు, తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కారణంగా ప్లాంట్ పనులకు విఘాతం కలుగుతోంది.

Bihar: నిద్రిస్తున్న రైతులపై మంగళవారం అర్థరాత్రి పోలీసులు దాడి చేసి, విచక్షణా రహితంగా కొట్టడం బిహార్ రాష్ట్రంలో కలకలం రేపింది. భూముల వ్యవహారంపై గత రెండు నెలలుగా నిరసన చేస్తున్న వారిపై పోలీసుల దాష్టీకం ఇది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిరసనకారులు పోలీసులు వాహనాలను ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు. అంతే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని బక్సర్ జిల్లాలో జరిగిందీ ఘటన.

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ముగింపు సభకు 24 పార్టీలకు ఆహ్వానం

చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ సేకరించిన భూముల వ్యవహారంపై రెండు నెలలుగా రైతులు నిరసన చేస్తున్నారు. కంపెనీ గేటు బయటే నిరాహార దీక్ష చేపట్టిన రైతులు, తమకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కారణంగా ప్లాంట్ పనులకు విఘాతం కలుగుతోంది. ఈ క్రమంలో నిరసనలు సాగిస్తున్న రైతులు ఉంటున్న ఇంటిపై మంగళవారం రాత్రి పోలీసులు విరుచుకుపడటం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతులతో పాటు వారి కుటుంబసభ్యులపై కూడా పోలీసులు దాడులకు దిగారు. గ్రామంలోని ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

Assam: బెయిల్ ఇవ్వాలంటూ నిరాహార దీక్షకు దిగిన 112 మంది ఖైదీలు

అర్థరాత్రి సమయంలో పోలీసులు జరిపిన దాడులకు ప్రతిగా స్థానికులు బక్సర్ రోడ్లపైకి వచ్చి బుధవారం ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ విషయమై రైతు నిరసనకారుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, సరైన పరిహారం ఇవ్వనందునే తాము నిరసనలు చేస్తున్నామని చెప్పాడు. అయితే గత రాత్రి పోలీసులు ఒక రైతు ఇంటిపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా కొట్టారని, నలుగురిని అరెస్టు చేశారని, ఎస్‌జేవీఎన్ కంపెనీ కారణంగానే పోలీసులు తమను వేధిస్తునట్టు తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు