Bihar Polls: లీడింగ్‌లో సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్

Bihar Polls: లీడింగ్‌లో సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్

Updated On : November 10, 2020 / 12:55 PM IST

Bihar Polls: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జీడీ) లీడర్, మహగత్‌బంధన్ సీఎం క్యాండిడేట్ తేజస్వి యాదవ్ రాఘోపూర్ అసెంబ్లీ సీట్ నుంచి ఆధిక్యంలో ఉన్నారని ఎలక్షన్ కమిషన్ తెలిపింది.




ఈసీఐ ఇచ్చిన డేటా ప్రకారం.. బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్ కంటే వెయ్యి 554ఓట్లతో యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 11గంటల 30నిమిషాలకు బీజేపీ 70 సీట్ల ఆధిక్యంలో దూసుకొస్తుండగా.. నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్(ఎన్డీఏ), జనతాదళ యునైటెడ్ ల కూటమి 48సీట్ల ఆధిక్యంతో కొనసాగుతోంది. కాంగ్రెస్ 20, లెఫ్ట్ పార్టీలు కలిపి 19 సీట్ల ఆధిక్యంతో ఉన్నాయి.




వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) ఏడు సీట్లతో, హిందూస్తానీ అవామ్ మోర్చ్ ఒక్క సీట్‌తో కొనసాగుతున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికలకు లోక్ జనశక్తి పార్టీ సోలోగా పోటీచేసి ప్రస్తుతం 5సీట్లతో కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 8గంటలకు మొదలైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ 38జిల్లాల్లో 55 కౌంటింగ్ సెంటర్లలో కొనసాగుతోంది.