Orphans by Covid: కొవిడ్ కారణంగా పేరెంట్స్‌లో ఏ ఒక్కరు పోయినా నెలకు రూ.1500

కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ.1500 చొప్పున బాల్ సహాయతా యోజన పథకం కింద చెల్లించనున్నారు. వారికి 18ఏళ్లు వచ్చేవరకూ డబ్బులు చెల్లిస్తామని..

Orphans by Covid: కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోయి అనాథలైన పిల్లలకు నెలకు రూ.1500 చొప్పున బాల్ సహాయతా యోజన పథకం కింద చెల్లించనున్నారు. వారికి 18ఏళ్లు వచ్చేవరకూ డబ్బులు చెల్లిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. అటువంటి పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్ లో ఉంచుతామని ప్రకటించారు.

‘కొవిడ్ కారణంగా పేరెంట్స్ ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు లేదా వైరస్ ప్రభావంతో ఇద్దరిలో ఓ ఒక్కరినో కోల్పోయిన పిల్లలకు రూ.1500 చొప్పున 18ఏళ్లు వచ్చే వరకూ రాష్ట్రం చెల్లిస్తుంది. అటువంటి పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్ కూడా తీసుకెళ్తారు. అనాథలైన పిల్లలను కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలో చేర్పిస్తామని ముఖ్యమంత్రి మరో ట్వీట్ లో వెల్లడించారు.

అటువంటి పిల్లలకు ఫ్రీ స్కూలింగ్, ఫైనాన్షియల్ అసిస్టెంట్ లతో పాటు ఇతర సహాయం అందిస్తామని చాలా రాష్ట్రాలు ప్రకటించాయి. ఢిల్లీ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించేశాయి.

ఈ వారం మొదట్లో కొవిడ్ మహమ్మారి కారణంగా అనాథలైన పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ లాంటి వాటికి అధికారిక స్టేట్మెంట్ వచ్చే వరకూ ఆగకుండా అందించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

ట్రెండింగ్ వార్తలు