ఢిల్లీలో షాకింగ్. నడిరోడ్డుపై దొంగలు బరితెగించేశారు. ఇంద్రపురి ఏరియాలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుంది. అప్పటికే అక్కడ కాపుకాసిన ఇద్దరు వ్యక్తులు బైక్ పై సిద్ధంగా ఉన్నారు. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఆ మహిళను టార్గెట్ చేశారు. ఒకడు బైక్ పైనే ఉండగా.. మరొకడు వెనక నుంచి వచ్చి మెడ పట్టుకున్నాడు. చైన్ లాగబోయాడు.
అలర్ట్ అయిన ఆ మహిళ.. ఆ దొంగ నుంచి రక్షించుకోవటానికి ప్రయత్నించింది. మెడలోని బంగారు చైన్ ను గట్టిగా పట్టుకుంది. అంతే వాడు మరింత రెచ్చిపోయాడు. ఆమెను రోడ్డుపై పడేసి కొట్టాడు. జుట్టు పీకాడు. అయినా వదల్లేదు ఆమె. ఆ దొంగతో పోరాడింది. వాడు కూడా బలవంతంగా ఆమె మెడలోని చైన్ లాక్కుని వెళ్లాడు. ఈలోపు బైక్ పై రెడీగా ఉన్న మరొకడు.. వెంటనే స్పాట్ దగ్గరకు వచ్చి.. వాడిని ఎక్కించుకుని వెళ్లాడు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఢిల్లీలోని ఇంద్రపురి కాలనీలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల కోసం గాలిస్తున్నారు. చైన్ స్నాచర్ల కోసం అన్ని సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు.
#WATCH CCTV: Bike borne assailants snatch a woman’s chain in Delhi’s Inderpuri area (13.5.19) pic.twitter.com/EaNJLCxG1v
— ANI (@ANI) May 16, 2019