Corbevax : పిల్లలకు కరోనా వ్యాక్సిన్… కోర్బెవాక్స్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతులు

హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్-ఇ ఫార్మా సంస్థ కోర్బెవాక్స్ పేరుతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ కు తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చ

Corbevax : హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్-ఇ ఫార్మా సంస్థ కోర్బెవాక్స్ పేరుతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ కు తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. కోర్బెవాక్స్ పూర్తిగా దేశీయ వ్యాక్సిన్. దీన్ని 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు వేసేలా రూపొందించారు. దీనికి తదుపరి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. మరికొన్ని నెలల్లోనే కోర్బెవాక్స్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Defence Jobs : పది పాస్ అయితే చాలు, రక్షణశాఖలో ఉద్యోగాలు

చిన్నారులు, కౌమారులకు(అడల్ట్స్) ఈ వ్యాక్సిన్‌ ఎంత భద్రం? ఎలాంటి రోగనిరోధక స్పందనలు కలుగజేస్తుంది? అన్న విషయాలు ప్రయోగ పరీక్షల ద్వారా తెలుస్తాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. హైదరాబాద్‌ కేంద్రంగా బయోలాజికల్‌ ఇ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా పది ప్రాంతాల్లో ఈ క్లినికల్‌ పరీక్షలు చేపట్టనున్నారు.

AP High Court Key Verdict On Jagananna Vidya Deevena

హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ హబ్ గా అవతరిస్తోంది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ తయారుచేసి అంతర్జాతీయ చిత్రపటంలో హైదరాబాద్ కు మరింత వన్నె తెచ్చింది.

ట్రెండింగ్ వార్తలు