బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ : అంతా ఆన్ లైన్ లోనే

  • Publish Date - January 10, 2019 / 04:47 AM IST

ఢిల్లీ : జనన, మరణాలను ఇక నుండి ఆన్ లైన్ లోనే ఇంటి వద్ద నుండే చేసుకునే వీలును కల్పించింది కేంద్ర ప్రభుత్వం. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ లో పారదర్శకతను పాటించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్‌ రిజిస్ర్టేషను సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) పేరుతో జనవరి 10  నుంచి ఓ యాప్‌ను అమలులోకి తెస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఇన్ఫర్మేషన్ ను రిజిస్టర్ చేస్తే..15 రోజులల్లోగా సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ ను గవర్నమెంట్  ఆన్ లైన్ లో పెట్టేస్తుంది. దీంతో బర్త అండ్ డెత్ సర్టిఫికేషన్ డాక్యుమెంట్స్ ను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు. 
 
ఇప్పటివరకు రాష్ట్రాల వారీగా జనన మరణాల నమోదు ప్రాజెస్  జరిగేది. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం మరింత సరళతరం చూస్తే ఆన్ లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సర్టిఫికెట్ ఇవ్వాలంటే చేతిలో పైసలు పడందే పనిచేయని  కొంతమంది అవినీతి అధికారుల ఆటలకు కేంద్రం అడ్డుకట్ట పడినట్లే.  రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు, నగరపాలక సంస్థల్లో జనన, మరణాల జాబితాను ఆన్ లైన్  చేయాలని 6 నెలల క్రిందటే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన క్రమంలో సివిల్‌ రిజిస్ర్టేషను సిస్టమ్‌ (సీఆర్‌ఎస్‌) పేరుతో జనవరి 10 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన అవగాహన కోసం ఏపీ ప్రభుత్వం గుంటూరులోని మెడికల్‌ అసోసియేషన్ హాలులో జనవరి 8న మున్సిపల్‌ గణాంకాధికారి కార్యాలయ అధికారులు, సిబ్బంది పట్టణంలోని వైద్యులకు నూతన విధానంపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

దళారుల దోపిడీకి చెక్..
ఇప్పటివరకు జనన, మరణాలను పొందేందుకు ప్రజల నానా ఇబ్బందులు పడేవారు. ఆస్పత్రుల్లోను..ఇంటి వద్ద జరిగిన జననాలు..మరణాలు నమోదు చేయకపోయినా ఎన్ వోసీ, తహసీల్దార్‌, ఆర్డీవో, మున్సిపల్‌ కార్యాలయాలకు తిరగాల్సిన పరిస్థితులు..తిరిగినా కొంతమంది బ్రోకర్స్ ఈ సర్టిఫికెట్స్ ఇప్పించేదుకు రెడీగా వుండటమేకాక..రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు డిమాండ్ చేసి మరీ వసూలు చేసేవారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన ఈ విధానంతంతో దళారుల ఆటలకు చెక్ పడినట్లే.  ఈ క్రమంలో జనన..మరణాలను ఇంటి నుంచే నమోదు చేసుకునే సీఆర్‌ఎస్‌ సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీంతో డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి మున్సిపాలిటీలో ఇది అమలులోకి వస్తుంది. దీని కోసం ప్రజలు గూగుల్‌ ప్లే స్టోర్‌లో సాఫ్ట్‌వేర్‌ను డౌన్ లోడ్‌ చేసుకుని వారి ఇన్ఫర్మేషన్ ను ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ చేసిన  15 రోజులల్లోగా ఆన్ లైన్ ద్వారానే ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. 

ఈ ప్రాసెస్ అంతా సక్రమంగా జరిగితే బర్త అండ్ డెత్ రిజిస్ట్రార్ డిజిటల్‌ సంతకం చేసిన డాక్యుమెంట్ ను  ఆన్ లైన్లో పెట్టేస్తారు. అనంతరం రిజిస్టర్ చేసినవారు ఈ డాక్యుమెంట్ ను డౌన్ లోడ్‌ చేసుకోవచ్చు. డాక్టర్స్ కూడా ఆస్పత్రుల్లో జనన, మరణాల వివరాలను ఆన్ లైన్లో నమోదు చేస్తే మున్సిపల్‌ కార్యాలయానికి చేరుతుంది. రిజిస్టర్ దారుడి  ఫోన్ నెంబరు లేదా ఈ మెయిల్‌కు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.  

కేంద్రం పరిధిలోకే బర్త అండ్ డెత్ సర్టిఫికెట్స్ బాధ్యత
ఇప్పటి వరకు జనన, మరణాల రికార్డ్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే జరిగేది. ఇక నుంచి ఇదంతా కేంద్రం హ్యాండోవర్ చేసుకుంది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ను ఆన్ లైన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. ఈ ప్రాజెస్ అంతా గత ఆరు నెలలుగా కొనసాగుతోంది.