BJP Candidate: తమిళనాడు ఎన్నికల్లో ఒక్క ఓటు మాత్రమే సాధించిన బీజేపీ కార్యకర్త.. ఫ్యామిలీలో ఐదుగురున్నా..
తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు సాధించాడు బీజేపీ కార్యకర్త. స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన అతనికి ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులున్నా ఒక్క ఓటు మాత్రమే.

One Vote!
BJP Candidate: తమిళనాడులో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు సాధించాడు బీజేపీ కార్యకర్త. స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసిన అతనికి ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులున్నా ఒక్క ఓటు మాత్రమే దక్కింది. ఎన్నికల ఫలితాల్లో అతనికి వచ్చిన రిజల్ట్ చూసి Single_Vote_BJP అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు.
కోయంబత్తూరు జిల్లాలోని పెరియనాయికెన్‌పాలయం యూనియన్‌లో వార్డ్ మెంబర్ పదవికి డి. కార్తీక్ పోటీ చేశారు. అపహాస్యంగా మారిన ఈ పోటీ ఫలితంపై ఆయనే స్పందించారు. బీజేపీ యూత్ వింగ్ జిల్లా డిప్యూటీ ప్రెసిడెంట్ కార్తీక్, మాట్లాడుతూ.. బీజేపీ తరపున పోటీ చేయలేదు. కారు గుర్తుపై స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశాను” అని స్పష్టం చేశారు.
తన కుటుంబానికి సంబంధించిన ఓట్లు 4వ నెంబర్ వార్డులో ఉన్నాయని, అందుకే తనకు ఆ ఓట్లు కూడా పడలేదని అన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ చిహ్నాల మీద పోటీ చేయరు. పార్టీలు అధికారికంగా వారికి సపోర్ట్ ఇస్తుంటాయి.
…………………………………………………….. : గేట్లు తెరిచి బయటకి వెళ్ళిపోమన్న బిగ్ బాస్.. షాక్ లో కంటెస్టెంట్స్..
ట్విట్టర్ ప్రచారం కోసం కార్తీక్ విడుదల చేసిన పోస్టర్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో సహా ఏడుగురు నాయకుల ఫొటోలు ఉన్నాయని, అయినా అతనికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభించిందని మరొక ట్విట్టర్ యూజర్ సూచించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ 6, 9 తేదీల్లో జరిగాయి. మొత్తం 27వేల 3 పోస్టులకు 79వేల 433 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.