Priyanka Gandhi
మహారాష్ట్ర ఎన్నికల వేళ నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు కొందరు బీజేపీ జెండాలు చూపారు. దీంతో అక్కడ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
రోడ్డు పక్కన, బిల్డింగుల మీద కూడా నిలబడి బీజేపీ కార్యకర్తలు తమ పార్టీ జెండాలు చూపారు. తనకు బీజేపీ జెండాలు చూపినప్పటికీ ప్రియాంకా గాంధీ ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా.. ఆ పార్టీ కార్యకర్తలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
“ఎన్నికల వేళ బీజేపీలోని మిత్రులకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. కానీ మహా వికాస్ అఘాడీనే ఈ ఎన్నికల్లో గెలుస్తుంది” అని ప్రియాంకా గాంధీ అన్నారు. కాగా, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లోనే ఉంటుంది. ఈ నగరం బీజేపీకి కంచు కోటగా కొనసాగుతోంది.
నాగ్‌పూర్ లోక్‌సభ స్థానంలో 2014 నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్లమెంటు నియోజక వర్గంలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాలుగింటిలో ప్రస్తుతం బీజేపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరోవైపు, ప్రియాంకా గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజక వర్గ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
गढ़ में घुस कर ललकारना इसे कहते हैं
नागपुर में गरजीं @priyankagandhi
RSS और भाजपा वालों शुभकामनाएँ लेकिन जीतेगी तो महाविकास आघाड़ी ही! pic.twitter.com/YMj5ynuvpg
— Supriya Shrinate (@SupriyaShrinate) November 17, 2024