Kailash Gahlot : బీజేపీలో చేరిన కైలాశ్ గెహ్లాట్.. ఆప్ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి

ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ సోమవారం బీజేపీలో చేరారు.

Kailash Gahlot : బీజేపీలో చేరిన కైలాశ్ గెహ్లాట్.. ఆప్ నేతల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి

Kailash Gahlot Joins BJP

Updated On : November 18, 2024 / 1:27 PM IST

Kailash Gahlot Joins BJP: ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కొద్దిగంటల్లోనే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ సోమవారం బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్, ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవ్ సమక్షంలో కైలాశ్ గెహ్లాట్ బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆదివారం గెహ్లాట్ రాజీనామా చేశారు. రాజీనామాకు గల కారణాలను లేఖలోరాసి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు పంపించిన విషయం తెలిసిందే.

Also Read : Kailash Gehlot Resigns: కేజ్రీవాల్‌కు బిగ్‌షాక్.. ఆమ్ఆద్మీ పార్టీకి మంత్రి కైలాష్ గెహ్లాట్ రాజీనామా

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్ నేత అయిన కైలాశ్ గెహ్లాట్ రాజీనామా ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బేనని చెప్పొచ్చు. గెహ్లాట్ రాజీనామా చేసిన వెంటనే పార్టీ అధిష్టానం ఆమోదించడం విశేషం. ఆపార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీలో చేరేందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి గెహ్లాట్ రాజీనామా చేశారని విమర్శించారు. ఆప్ నేతలు ఆరోపించినట్లుగానే గెహ్లాట్ సోమవారం బీజేపీ కండువా కప్పుకున్నారు.

 

బీజేపీలో చేరిన తరువాత కైలాశ్ గెహ్లాట్ మాట్లాడుతూ.. తాను బీజేపీలో చేరాలనే నిర్ణయం రాత్రికిరాత్రే తీసుకోలేదని చెప్పారు. ఎన్నో ఆలోచనల తరువాత తాను ఆమ్ ఆద్మీ పార్టీని వీడటం జరిగిందని చెప్పారు. పార్టీ ప్రధాన విలువలు, నైతికతలకు నాయకత్వం దూరమైందని గెహ్లాట్ విమర్శించారు. నేను ఎవరో చేసిన ఒత్తిళ్ల కారణంగా బీజేపీలో చేరలేదు. కానీ, ఆప్ దాని భావజాలానికి రాజీపడింది. కాబట్టి నేను మొదట్లో సామాన్య ప్రజలకు సేవ చేయడానికి ఆప్ లో చేరాను. కానీ, ఇప్పుడు పార్టీ దాని అసలు లక్ష్యం నుంచి పక్కకు వెళ్లిపోయిందని ఢిల్లీ మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ విమర్శించారు.