Rahul Gandhi: భారత్‌ను రెండు రకాలు చేశారు ధనికులకొకటి, పేదలకొకటి: ప్రధానిపై రాహుల్ విమర్శలు

"ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ" పేరుతో గుజరాత్ లోని గిరిజన జిల్లా అయిన దహోద్ లో జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు. “బీజేపీ పాలనలో భారత దేశాన్ని రెండు రకాలుగా విభజించారు, ధనికులకొకటి, పేదలకొకటి. దేశంలో వనరులన్నీ బీజేపీ ప్రభుత్వం ధనికులకే కట్టబెడుతుంది” అని రాహుల్ గాంధీ విమర్శించారు. త్వరలో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. “ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీ” పేరుతో గుజరాత్ లోని గిరిజన జిల్లా అయిన దహోద్ లో జరిగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.

Also read:Qutb Minar: కుతుబ్ మినార్‌ను విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ ఆందోళన

ర్యాలీలో ప్రజలనుద్దేశించి రాహుల్ మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. “2014లో ప్రధాని అయిన నరేంద్ర మోదీ..అంతకముందు గుజరాత్ సీఎంగా చేశారని..అప్పుడు ఆ రాష్ట్రంలో ప్రారంభించిన పనులనే ఇప్పుడు కేంద్రంలోనూ కొనసాగిస్తున్నారని..దానినే గుజరాత్ మోడల్ అంటారంటూ” ప్రధాని మోదీ పాలన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్.

Also read:Floating Bridge: కర్ణాటకలో ప్రారంభించిన మూడు రోజుల్లోనే ధ్వంసం అయిన ‘తేలియాడే వంతెన’

“మోదీ పాలనలో నేడు దేశం రెండుగా విభజించబడింది, ఒకటి సంపన్న వర్గాలకు, కొంతమంది ఎంపిక చేయబడ్డ వ్యాపారస్తులకు, పలుకుబడి, డబ్బు ఉన్న కోటీశ్వర్లుకు మరియు బ్యూరోక్రాట్లుకు. రెండవ భారతదేశం సామాన్య ప్రజల కోసం సృష్టించారు” అని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ మోడల్ పాలనలో గిరిజనులు, పేద ప్రజలకు దక్కాల్సిన నీరు, అడవి మరియు భూమి వంటి వనరులన్నీ ఇతరులకు దక్కుతున్నాయని రాహుల్ విమర్శించారు. దేశంలో కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా ఈసందర్భంగా రాహుల్ విమర్శలు గుప్పించారు.

Also read:Minister Nitin Gadkari : ‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే’’..అంటూ ఆశ్చర్యపోయిన కేంద్రమంత్రి గడ్కరి

ట్రెండింగ్ వార్తలు