Minister Nitin Gadkari : ‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే’’..అంటూ ఆశ్చర్యపోయిన కేంద్రమంత్రి గడ్కరి

‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే..ఆ విషయాన్ని ఓ ఐఏఎస్ అధికారి అతి సాధారణంగా చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది ’’..అంటూ ఆశ్చర్యపోయారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరి.

Minister Nitin Gadkari : ‘‘గాలికి బ్రిడ్జ్ ఎలా కూలుతుందో విడ్డూరంగా ఉందే’’..అంటూ ఆశ్చర్యపోయిన కేంద్రమంత్రి గడ్కరి

Union Minister Nitin Gadkari

Minister Nitin Gadkari : ఈదురు గాలులకు గాలికి చెట్టు కూలిపోయింది..లేదా టవర్ కూలిపోయింది అనే మాటలు వింటుంటాం. కానీ ఏకంగా ఓ భారీ వంతెనే కూలిపోయింది తెలిసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఆశ్చర్యపోయారు. అదికూడా ఓ ఐఏఎస్ అధికారి ఈ విషయాన్ని అదేదో అత్యంత సాధారణ విషయం అని చెప్పటంతో మంత్రి గడ్కరి ఖంగుతిన్నారట. ఆ విషయాన్ని మంత్రిగారే స్వయంగా చెప్పుకొచ్చారు.

కాగా..బిహార్‌లో ఇటీవల నిర్మాణంలో ఉన్న ఓ భారీ వంతెన కొంతభాగం కూలిపోయింది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వివరణ కోరారు. దీంతో ఆ వంతెన గాలికి కూలిపోయింది అని ఐఏఎస్‌ అధికారి ఒకరు సమాధానమిచ్చారట. దీంతో కేంద్రమంత్రి గడ్కరి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని స్వయంగా గడ్కరీనే చెప్పడం మరో విశేషం.

ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గడ్కరీ మాట్లాడుతూ గాలికి వంతెన కూలిపోయిన విషయాన్ని చెప్పుకొచ్చారు..‘‘ఏప్రిల్‌ 29న బిహార్‌లో ఓ వంతెన కూలింది. దీనికి కారణమేంటని నేను నా సెక్రటరీని అడిగాను..దానికి అతను బలమైన గాలులు వీయడం వల్లే బ్రిడ్జి కూలిందని తేలిగ్గా చెప్పేశారు. ఓ ఐఏఎస్‌ అధికారి ఇలాంటి వివరణ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. అయినా గాలుల వల్ల వంతెన ఎలా కూలుతుందో నాకర్థం కాలేదు. నిర్మాణంలో ఏమైనా లోపం ఉందేమో’’ అని గడ్కరీ చెప్పుకొచ్చారు. నాణ్యాతపరమైన లోపాలు లేకుండా తక్కువ ఖర్చులో వంతెనల నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి ఈ సందర్భంగా అన్నారు.

కాగా..బిహార్‌లోని సుల్తాన్‌గంజ్‌, అగౌనీ ఘాట్‌ మధ్య రూ.1710 కోట్లతో 2014లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభించారు. దీని పొడవు 3.116కిలోమీటర్లు. 2019 నాటికే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ అనుకున్న సమచానికి పూర్తి కాలేదు. ఈక్రమంలో ఏప్రిల్‌ 29న ఈ వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. దీనిపై సీఎం నీతీశ్ కుమార్‌ దర్యాప్తునకు ఆదేశించినట్లు సుల్తాన్‌గంజ్‌ ఎమ్మెల్యే లలిత్‌ నారాయణ్ మండల్‌ వెల్లడించారు. బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత తక్కువ ఉన్న మెటీరియల్‌ వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.