Good News To Poor : నిరుపేదలకు శుభవార్త…ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కీలక ప్రకటన

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుపేద కుటుంబాలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం అందించనున్న బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది....

Good News To Poor : నిరుపేదలకు శుభవార్త…ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కీలక ప్రకటన

Free Rice To Poor

Updated On : December 27, 2023 / 7:48 AM IST

Good News To Poor : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుపేద కుటుంబాలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం అందించనున్న బీజేపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 67,92,153 మంది అర్హులైన అంత్యోదయ, ప్రాధాన్యతా, వికలాంగులు, ఒంటరి నిరుపేద వర్గాలకు అర్హులైన రేషన్ కార్డ్ హోల్డర్లకు చౌక ధరల దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పొందవచ్చని సర్కారు తెలిపింది.

ALSO READ : Israel issues warning : ఢిల్లీలో పేలుడు ఎఫెక్ట్…భారత్‌లో తమ దేశ పౌరులకు ఇజ్రాయెల్ హెచ్చరిక

80 కోట్ల మంది పేదలకు అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తరహాలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఆహార భద్రత చట్టం కింద వచ్చే ఐదేళ్లపాటు పేద కుటుంబాలకు ఉచితంగా బియ్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ALSO READ : Covid guidelines : మాస్కులు, వ్యాక్సిన్, ఐసోలేషన్…ఇవీ సర్కార్ తాజా కొవిడ్ మార్గదర్శకాలు

ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి విష్ణుదేయసాయి ఆదేశాల మేరకు ఆహార, పౌరసరఫరాల శాఖ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం వంటి అంత్యోదయ, ప్రాధాన్యతా కేటగిరీ రేషన్ కార్డ్ హోల్డర్‌లకు వచ్చే ఐదేళ్లకు జనవరి 2024 నుంచి డిసెంబర్ 2028 వరకు నెలవారీ అర్హత ప్రకారం ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

ALSO READ : Ram Temple in Ayodhya : పవిత్ర అయోధ్య రామాలయాన్ని చూసొద్దాం రండి