Z category security : బీజేపీ లీడర్ బీఎస్ యెడియూరప్పకు జడ్ కేటగిరి సెక్యూరిటీ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పకు జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించారు. యెడియూరప్ప భద్రత దృష్ట్యా జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.....

BJP leader BS Yeddiyurappa
Z category security : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్పకు జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించారు. యెడియూరప్ప భద్రత దృష్ట్యా జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ముప్పు అంచనా నివేదిక అందిన తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పకు జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
Also Read : Ground Water : భారతదేశంలో భూగర్భజలాల క్షీణతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
కర్ణాటకలో పనిచేస్తున్న రాడికల్ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్ంలో యడియూరప్ప భద్రతపై ఆందోళన పెరిగింది. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. యెడియూరప్ప భద్రతను అప్ గ్రేడ్ చేస్తూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండోలను నియమించారు. మాజీ ముఖ్యమంత్రి రక్షణ కోసం 33 మంది జడ్ కేటగిరి సెక్యూరిటీ గార్డులను నియమించారు.
Also Read : T Congress : రేపు టీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల.. 40 మంది అభ్యర్థులకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్
వీరితోపాటు అదనంగా మరో పదిమంది సాయుధ స్టాటిక్ గార్డులను వీఐపీ నివాసం వద్ద నియమించారు. వీరు కాకుండా ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులు 24 గంటల పాటు రక్షణ కల్పించనున్నారు. షిప్టునకు 12 మంది చొప్పున సాయుధ ఎస్కార్ట్ కమాండోలు మూడు షిప్టుల్లో ఉండేలా నియమించారు. నిఘా కోసం మరో ఇద్దరు వాచర్లను నియమించారు. భద్రతా సిబ్బందితోపాటు ముగ్గురు శిక్షణ పొందిన డ్రైవర్లను కూడా నియమించారు.