Wrestlers Protest: లైంగిక వేధింపుల ఆరోపణలపై డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ సోమవారం కలిశారు. ఆందోళనకారులను కలిసిన అనంతరం బీరేందర్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. విచారణ అనంతరం దోషులను శిక్షించాలని డిమాండ్ అన్నారు. భారతీయ జనతా పార్టీకి నేతకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు ఆ పార్టీకి చెందిన నాయకుడే మద్దతు ఇవ్వడం గమనార్హం.
రెజ్లర్లు చేస్తున్న ఈ నిరసనకు వివిధ పార్టీల నేతలు మద్దతు ఇచ్చారు. ట్విట్టర్ ద్వారా కూడా వారికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాగా, వీరిని కలిసిన అనంతరం వారితో తీసుకున్న ఫొటోను బీరేందర్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ “జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న భారతదేశపు కుమారులు, కుమార్తెలను కలిశాను” అని ట్వీట్ చేశారు.
Karnataka: సీఎంగా సిద్ధరామయ్య.. డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు?
బ్రిజ్ భూషణ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి వారం రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మొదటి ఎఫ్‌ఐఆర్ మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలకు సంబంధించినది. ఇది లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) కింద నమోదైంది. ఇక రెండవది నమ్రతకు సంబంధించిన పెద్దల ఫిర్యాదులపై నమోదు చేశారు.