Syed Shahnawaz Hussain: భారతీయ జనతా పార్టీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ గుండె పోటుతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో హుస్సేన్‌కు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత హడావుడిగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్టు కుటుంబీకులు తెలిపారు.
షానవాజ్ హుస్సేన్ భాజపాలోని సీనియర్ నేతల్లో ఒకరు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అత్యంత పిన్న వయస్కుడైన కేంద్ర మంత్రిగా గుర్తింపు పొందారు. గత కొన్నేళ్లుగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి బిజీగా ఉన్నారు. సయ్యద్ షానవాజ్ హుస్సేన్ వాస్తవానికి బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు.
షానవాజ్ హుస్సేన్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకుముందు 2006లో బీజేపీ ఆయనను ఉప ఎన్నికల్లో గెలిపించుకుని పార్లమెంటుకు తీసుకొచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత 2019 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదు. షానవాజ్ హుస్సేన్ పోటీ చేసిన స్థానాన్ని జేడీయూకి ఇచ్చింది బీజేపీ.