మహా రాజకీయం : గవర్నర్ ను కలిసిన బీజేపీ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ-శివసేన పంతానికి పోతుండటంతో.. ప్రభుత్వ

  • Published By: veegamteam ,Published On : November 7, 2019 / 12:34 PM IST
మహా రాజకీయం : గవర్నర్ ను కలిసిన బీజేపీ

Updated On : November 7, 2019 / 12:34 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ-శివసేన పంతానికి పోతుండటంతో.. ప్రభుత్వ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశం రసవత్తరంగా మారింది. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ-శివసేన పంతానికి పోతుండటంతో.. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. కాగా.. గురువారం బీజేపీ నేతలు గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కలిశారు. ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతుండటంతో తీసుకోవాల్సిన చట్టపరమైన అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్, సీనియర్ నేత సుధీర్ ముంగంటివార్ గవర్నర్ ని కలిసి మాట్లాడారు. నవంబర్ 9వ తేదీతో అసెంబ్లీ గడువు ముగుస్తున్నందున భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామని వెల్లడించారు.

కాగా, సీఎం పదవిని చెరిసగం పంచుకోవాలని కొన్ని రోజులుగా శివసేన పట్టుబడుతూ వస్తోంది. దీనికి బీజేపీ నో చెబుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించిన సేనకు ఎన్సీపీ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షంలోనే కూర్చుంటామని, కలిసొచ్చేది లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శివసేన కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించినా.. గురువారం తన పంతం వీడేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ముందు జాగ్రత్తగా హోటల్ కి తరలించింది.

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చెప్పడం విశేషం. తమ మద్దతు బయట చూపాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు సభలో చూపిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ దగ్గర ఏ మార్గాలూ లేకుండా ఇలా మాట్లాడబోమన్నారు. బీజేపీ దగ్గర ఎమ్మెల్యేల బలం ఉంటే నిరభ్యంతరంగా ప్రభుత్వ ఏర్పాటు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. శివసేన నాయకుడే సీఎంగా ఉండాలని మహారాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారని రౌత్ చెప్పారు.