BJP MLA Bhupesh Chaubey : ఎన్నికల పాట్లు, క్షమించాలంటూ గుంజీలు తీసిన ఎమ్మెల్యే

తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల్లో తాను తప్పు చేసి ఉంటే... క్షమించాలంటూ వేదిక మీద గుంజీలు తీశారు. నన్ను క్షమించాలని.. చేతులు జోడించి...

UP Election 2022 : ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అభ్యర్థుల కష్టాలు మాములుగా ఉండదు. ఓటర్లను ఆకర్షించుకోవడానికి పడరాని పాట్లు పడుతుంటారు. ఒకరు దోసలు వేస్తుంటే..మరొకరు అంట్లు తోముతూ.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి యత్నిస్తుంటారు. ఇలాగే ఓ అభ్యర్థి చేసిన ఫీట్ హాట్ టాపిక్ అయ్యింది. మద్దతుదారులను క్షమించాలని కోరుతూ.. గుంజీలు తీయడం విశేషం. యూపీలో ఈ ఘటన చోటు చేసుకుంది. యూపీ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

Read More : UP Assembly Election 2022 : యూపీలో నాలుగో విడత.. 57.45 శాతం పోలింగ్ నమోదు

2022, ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇంకా మూడు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సోన్ భధ్రకు చెందిన భూపేష్ చౌబే రాబర్ట్స్ గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బరిలో నిలుచున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలు, బూత్ ఇన్ చార్జీలు, ఏజెంట్లు, మద్దతుదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. గత ఐదు సంవత్సరాల్లో తాను తప్పు చేసి ఉంటే… క్షమించాలంటూ వేదిక మీద గుంజీలు తీశారు. నన్ను క్షమించాలని.. చేతులు జోడించి వేడుకుంటున్నా అని అంటూ ఆయన గుంజీలు తీయడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More : UP Election 2022: నేడే యూపీలో 59స్థానాల్లో పోలింగ్.. లఖింపూర్ ఖేరీ, రాయ్‌బరేలీలో కూడా!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో నాలుగో విడత పోలింగ్ ముగిసింది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే ఓటు వేయడానికి క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. దీంతో భారీగా ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 62.55 శాతం పోలింగ్ నమోదు కాగా… 2019లో 60.03 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2.3 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.14 కోట్ల మంది పురుషులుంటే..99.3 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 13 వేల 817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు