మనిషేనా! : అమర జవాన్ అంతిమయాత్రలో ఎంపీ నవ్వులు

గురువారం(ఫిబ్రవరి-14,2019) జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల పార్థీవ దేహాలు ఇప్పటికే వారి వారి ఇళ్లకు చేరుకొన్నాయి. ఉగ్రదాడిలో అమరుడైన ఉత్రప్రదేశ్ లోని ఉన్నావ్ కి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అంతిమయాత్రలో బీజేపీ ఎంపీ తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. 

శనివారం(ఫిబ్రవరి-16,2019) ఉన్నావ్ లో అమర జవాన్ అజిత్ కుమార్ కు కడసారి నివాళులర్పించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సమయంలో జవాన్ భౌతికకాయం ఉంచిన వాహనంపై ఉన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ నవ్వుతూ వాళ్లందరికీ అభివాదం చేయడం వివాదాస్పదమైంది.

ఎంపీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎంపీ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జవాన్ అంతిమయాత్రను అభినందన యాత్రగా ఎంపీ ఫీల్ అవుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు ఇతను మనిషేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.