Himachal Pradesh Assembly Election: హిమాచల్ ప్రదేశ్‌లో 62 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. 11 మంది సిట్టింగ్‌లు ఔట్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో బీజేపీ 62 స్థానాలకు బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. కేబినెట్ మంత్రితో సహా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు.

Himachal Pradesh Assembly Election: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇటీవల ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ క్రమంలో బీజేపీ 62 స్థానాలకు బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌ను అతని ప్రస్తుత నియోజకవర్గం సెరాజ్ నుండి పోటీకి దింపింది.

Rahul Gandhi: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ డుమ్మా!

కేబినెట్ మంత్రితో సహా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కలేదు. ఇద్దరు మంత్రుల నియోజకవర్గాలను మార్పు చేశారు. రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకుడు, సిమ్లా అర్బన్ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన భరద్వాజ్ కసుంప్టి నుండి పోటీ చేయగా, నూర్పూర్ ఎమ్మెల్యే పఠానియాకు పొరుగున ఉన్న ఫతేపూర్ నుండి టిక్కెట్ దక్కింది. కేంద్ర మాజీ మంత్రి సుఖ్ రామ్ కుమారుడు అనిల్ శర్మను మండి నియోజకవర్గం నుంచి బీజేపీ బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత ప్రేమ్ కుమార్ ధుమాల్ పేరు జాబితాలో లేదు. తన కుమారుడు అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి కొనసాగుతున్నారు. 78ఏళ్ల వయస్సు కలిగిన ధుమాల్ పోటీ చేయడానికి ఇష్టపడటం లేదని పార్టీ నాయకత్వానికి తెలియజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బీజేపీ విడుదల చేసిన 62 మంది అభ్యర్థుల జాబితాలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు, అయితే మూడు సీట్లు మాత్రమే ‘ఎస్టీ కేటగిరీ’ కింద రిజర్వ్ చేయబడ్డాయి. తాజా జాబితా మూడింట రెండు వంతుల మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఈ జాబితాలో ఐదుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇదిలాఉంటే 2017 హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 44 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 21 సీట్లకు పరిమితమైంది. ప్రస్తుతం, హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో 45మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 22, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు