Bhupendra Patel Oath : గుజరాత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న భూపేంద్ర పటేల్

గుజరాత్‌లోని రాజ్ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం 2:20 గంటలకు రాష్ట్ర సీఎంగా సీనియర్ బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించనున్నారు.

Bjp Surprise Pick Bhupendra Patel's Oath As Gujarat Chief Minister Today

Bhupendra Patel Oath As CM : గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ భవన్‌లో సోమవారం (సెప్టెంబర్ 13) రాష్ట్ర సీఎంగా సీనియర్ బీజేపీ నేత భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2:20 గంటలకు భూపేంద్ర పటేల్‌తో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించనున్నారు. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ మాత్రమే ఈ రోజు ప్రమాణం చేయనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అధిష్టానంతో చర్చించాక మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించాయి. సీఎం పదవికి విజయ్ రూపాని రాజీనామా చేయడంతో భూపేంద్రను ఆ స్థానంలో గుజరాత్ సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది. అయితే అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన భూపేంద్రను సీఎంగా బీజేపీ ఎంపిక చేసింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈలోగా విజయ్ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు షాకిచ్చారు. దాంతో రాష్ట్ర కేబినెట్ మొత్తంలో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ (59) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌కు సన్నిహితుడు కావడంతో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పటేల్‌ను ఎంపిక చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అమిత్ షా సహా కొంతమంది బిజెపి సీఎంలు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.
Next Gujarat CM : విజయ్ రూపానీ రాజీనామా.. కొత్త సీఎం రేసులో ఎవరంటే?

ఆదివారం పటేల్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎంపికైనప్పుడు విజయ్ రూపానీ కూడా హాజరయ్యారు. పటేల్ నాయకత్వంలో పార్టీ విజయవంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తుందని రూపానీ తెలిపారు. గతంలో ఘట్లోడియా స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పటేల్ ఉన్నారు. కొత్త సీఎం రేసులో ముందుగా కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవియా, పరశోత్తం రూపాల ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రఫుల్ ఖోడా పటేల్, గుజరాత్ మంత్రి ఆర్‌సి ఫల్దుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. కానీ, ఊహించని రీతిలో భూపేంద్ర పటేల్ పేరును ఎంపిక చేసింది బీజేపీ.

సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన పటేల్.. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సభ్యుడిగా ఉన్నారు. 2017 గుజరాత్ ఎన్నికల్లో గెలిచారు. ఈ ఏడాది బీజేపీ పాలిత రాష్ట్రాలలో రాజీనామా చేసిన నాల్గవ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ కట్టడి చేయడంలో ఆయన పనితీరు పట్ల అసంతృప్తి కారణంగానే సీఎం రాజీనామా చేయాల్సి వచ్చినట్టు భావిస్తున్నారు. రూపానీ స్థానంలో భూపేంద్ర పటేల్ సీఎంగా ఎంపిక చేయడానికి కారణం.. పటీదార్ కమ్యూనిటీకి చేరువ కావడమే బీజేపీ వ్యూహాంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ హార్దిక్ పటేల్‌కు మద్దతునివ్వడంతో బీజేపీ భూపేంద్రను సీఎంగా బరిలోకి దింపినట్టు తెలుస్తోంది.
Gujarat CM : ఇలా ఎమ్మెల్యేగా గెలిచి అలా సీఎం పదవి పట్టేసి..రేపే భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం