Gujarat CM : ఇలా ఎమ్మెల్యేగా గెలిచి అలా సీఎం పదవి పట్టేసి..రేపే భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం

గుజ‌రాత్ కొత్త ముఖ్య‌మంత్రిగా ఎంపికైన‌ భూపేంద్ర ప‌టేల్ రేపు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

Gujarat CM : ఇలా ఎమ్మెల్యేగా గెలిచి అలా సీఎం పదవి పట్టేసి..రేపే భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం

Bupendrs

Gujarat CM గుజ‌రాత్ కొత్త ముఖ్య‌మంత్రిగా ఎంపికైన‌ భూపేంద్ర ప‌టేల్ రేపు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్ ఆయ‌న చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించ‌నున్నారు. అయితే, రేపు భూపేంద్ర ప‌టేల్ ఒక్క‌రే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేస్తార‌ని, మంత్రుల ప్రమాణ స్వీకారాలు ఉండ‌బోవ‌ని గుజ‌రాత్ బీజేపీ అధ్య‌క్షుడు సీఆర్ పాటిల్ మీడియాకు తెలిపారు.
.
గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ శ‌నివారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఇవాళ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్షం స‌మావేశమై భూపేంద్ర ప‌టేల్‌ను నూత‌న ముఖ్య‌మంత్రిగా ఎన్నుకున్న‌ది. మాజీ సీఎం విజ‌య్ రూపానీ భూపేంద్ర ప‌టేల్ పేరును ప్ర‌తిపాదించగా మిగ‌తా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర భాయ్ పటేల్ అనూహ్యంగా గుజరాత్ కొత్త సీఎంగా ఎంపికకావడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ఆయన్ను ఎంపిక చేయడానికి భాజపా వద్ద బదలమైన కారణమే ఉంది. సున్నిత స్వభావం.. కారణంగా ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.

భూపేంద్ర పటేల్..  2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్‌లోడియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1 లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి శశికాంత్ పటేల్‌పై ఆయన గెలుపొందారు. 2017 ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలుపుపొందిన నాయకుడు కూడా భూపేంద్ర పటేల్ కావడం విశేషం. ఆనందిబెన్ పటేల్ గవర్నర్‌గా నియమితురాలు కావడానికి ముందు 2012లో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.

భూపేంద్రను ‘దాదా’ అని ముద్దుగా పిలుచుకుంటారు ఆయన మద్దతుదారులు. ప్రజలతో మంచి బంధం ఉండటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు భారీగా ఓట్లు పడ్డాయి.

సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన  భూపేంద్ర పటేల్ కి…  ఆనందిబెన్ పటేల్ సన్నిహితుడిగా కూడా పేరుంది. పాటీదార్ కమ్యూనిటీకి చెందిన ఆయన అహ్మదాబాద్‌లోని మెమ్నాగర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు