Mamata Banerjee: నాకు సమాచారం అందింది.. ఎన్నికల ముందు బీజేపీ ఈ పని చేయనుంది: అసెంబ్లీలో మమతా బెనర్జీ

న్యూఢిల్లీలో ఇటీవల బీజేపీ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రణాళికలు రచించినట్లు తనకు సమాచారం అందిందని చెప్పారు. 

Mamata Banerjee

Mamata Banerjee – BJP: బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్లో (West Bengal) ఏదైనా అలజడి సృష్టించడానికి ప్రణాళికలు వేసుకుంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. ప్రజలను విడగొట్టి విధ్వంసం సృష్టించి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చాలనుకుంటోందని ఆరోపించారు.

న్యూఢిల్లీలో ఇటీవల బీజేపీ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రణాళికలు రచించినట్లు తనకు సమాచారం అందిందని చెప్పారు. ఇవాళ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చేందుకు ఏదైనా పార్టీకి నిధులు ఇవ్వాలని బీజేపీ ప్రణాళికలు వేసుకుందని ఆరోపించారు.

కుల, మతాల వారీగా సమాజాన్ని విడగొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేయనుందని చెప్పారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేస్తూ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటోందని అన్నారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ హింస, శాంతి భద్రతల సమస్య గురించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు దాదాపు మరో 10 నెలల సమయం ఉంది. అప్పుడే ఆ ఎన్నికలను ప్రస్తావిస్తూ ఎన్డీఏ, ఇండియా మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Manipur Violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. తుపాకులతో ఇరు వర్గాల ఘర్షణ