Manipur Violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. తుపాకులతో ఇరు వర్గాల ఘర్షణ

మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

Manipur Violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. తుపాకులతో ఇరు వర్గాల ఘర్షణ

Updated On : July 27, 2023 / 8:17 PM IST

Gun Fight: రెండు నెలల రావణకాష్టం అనంతరం ఇప్పుడిప్పుడే కాస్త చల్లబడిందనుకుంటున్న సమయంలో మణిపూర్‭లో మరోసారి హింస చెలరేగింది. బుధవారం రాత్రి, గురువారం ఉదయం బిష్ణుపూర్‌ సమీపంలోని మొయిరంగ్‌లో రెండు వర్గాల మధ్య తుపాకుల ఘర్షణ జరిగింది. ఆ ప్రాంతంలో తమకు కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు. ఘర్షణ జరిగిన చోటుకు సమీపంలోని గ్రామస్థులు హుటాహుటిన అక్కడి నుంచి వేరొక చోటుకు పరుగులు తీసి, ప్రాణాలు కాపాడుకున్నారని తెలిపారు.

Vande Bharat Express : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వడ్డించిన ఆహారంలో బొద్దింక .. స్పందించిన IRCTC

ఓ వార్తా సంస్థతో స్థానికులు మాట్లాడుతూ.. బుధవారం రాత్రి నుంచి ఈ గ్రామంలో హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయని, తుపాకులతో కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. తాము రాత్రంతా నిద్రపోలేదని, ఏమీ తినలేదని చెప్పారు. ఎడతెగకుండా కాల్పుల శబ్దాలు వినిపిస్తుండటంతో తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. భద్రతా దళాలు ప్రయాణించేందుకు ఉపయోగించే రెండు బస్సులను మణిపూర్‌లోని కంగ్పోక్పిలో కొందరు దుండగులు బుధవారం తగులబెట్టారు. దిమాపూర్ నుంచి వస్తుండగా వీటిని మంగళవారం రాత్రి సపోర్మీనా వద్ద తగులబెట్టినట్లు తెలసింది.

MLC Kavitha: కల్వకుంట్ల కవితను కలిసిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్.. ఆ తర్వాత ఆసక్తికర కామెంట్స్

మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంవీ మురళీధరన్‌తో కూడిన ధర్మాసనం మార్చి 27న మైతీ, కుకీల మధ్య పోరు ఏమిటనే అంశంపై తీర్పునిచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మైతీ వర్గాన్ని కూడా ఎస్టీ కేటగిరీలో చేర్చాలని కోరారు. హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వు చట్టవిరుద్ధమని కుకీ సంఘం పేర్కొంది. మణిపూర్‌లో ప్రధానంగా మైతీ, కుకి, నాగ కులాలు నివసిస్తున్నాయి. నాగా, కుకి ఇప్పటికే గిరిజన హోదాను కలిగి ఉన్నాయి. కానీ 1949లో ఈ హోదా నుంచి మైతీలను తొలగించారు. అప్పటి నుంచి మైతీ వర్గం ప్రజలు తమకు గిరిజన హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది.

Vinod Sharma: నరేంద్ర మోదీ మీద బీజేపీ నేతకే నమ్మకం లేదట.. హోర్డింగ్ పెట్టి మరీ రచ్చ

మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బలంగా ఉన్న మైతీ వర్గం ప్రజలు తమ పర్వతాలను కూడా ఆక్రమిస్తారని కుకీ కమ్యూనిటీ ప్రజలు భావిస్తున్నారు.

Operation Moranchapalli : నీట మునిగిన గ్రామం.. రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు, 70మంది సేఫ్

మే 3 నుంచి మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ హింసాత్మక సంఘటనల్లో దాదాపు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని 10 శాతం భూభాగంలో మైతీలు ఉంటారు. కుకీలు, నాగాలు ఎస్టీ వర్గంలోకి వస్తారు. వీరు రాష్ట్రంలోని దాదాపు 90 శాతం భూభాగంలో ఉంటారు. మెయిటీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం కాగా.. కుకీలు, నాగాలు కలిపి 40 శాతం వరకు ఉంటారు.