Arvind Kejriwal: ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కేజ్రీవాల్.. ఎమ్మెల్యేలతో భేటీకి పిలుపు

ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. గురువారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశం ఏర్పాటు చేశారు.

Arvind Kejriwal: ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం జరిగే సమావేశానికి హాజరుకావాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

Rajasthan: రాజస్థాన్‌లో మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి.. స్పృహ తప్పిన విద్యార్థి

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తమ పార్టీని చీలిస్తే తనకు సీఎం పదవి ఇస్తామని బీజేపీ ఆశ చూపిందని, అలాగే బీజేపీలో చేరితే తమ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఇస్తామని కూడా బీజేపీ ఆఫర్ ప్రకటించిందని మనీష్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ).. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసింది. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వం వహిస్తారు. ఈ అంశంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో పీఏసీ సమావేశం జరుగుతుంది.

Kapil Dev: ఆ మ్యాచ్ గురించి గుర్తొస్తే.. ఇప్పటికీ నిద్ర పట్టదు: కపిల్ దేవ్

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టాలనుకుంటోంది. మనీష్ సిసోడియా ఇంటిపై ఈడీ జరిపిన దాడుల్లో డబ్బు, డాక్యుమెంట్లు, నగలు వంటివేవీ దొరకలేదు. రాజ్యాంగేతర పద్ధతుల్లో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నాం. ఒక్క ఆప్ ఎమ్మెల్యే కూడా పార్టీని వీడి వెళ్లరు. ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు కాకుండా.. మోదీ తన శక్తిని దేశం కోసం వెచ్చించాల్సిందిగా కోరుతున్నాం’’ అని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.