Hurl Shoes At Rahul Posters: రాహుల్ ఫొటోలపై చెప్పులు విసురుతూ, ఇంకు చల్లుతూ బీజేపీ కార్యకర్తల హల్‭చల్

స్వాతంత్ర్యోద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమిటని ఓ విలేకరి అడిగినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆ కాలంలో బీజేపీ లేదని, స్వాతంత్ర్యోద్యమంలో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆరెస్సెస్ బ్రిటిష్‌వారికి సహాయపడిందని, దామోదర్ సావర్కర్ బ్రిటిష్‌వారి నుంచి స్టైపెండ్ పొందేవారని చెప్పారు

Hurl Shoes At Rahul Posters: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) బ్రిటిష్‌వారికి సహాయపడిందని, దామోదర్ సావర్కర్ బ్రిటిషర్ల నుంచి స్టైపెండ్ తీసుకునేవారని ఆరోపించిన రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో రాహుల్ చిత్ర పటంపైకి చెప్పులు విసురుతూ నల్ల రంగు పూస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యాలను తిప్పి కొడుతూ ఆదివారం ‘జూతా మారో ఆందోళన్’ అనే పేరుతో స్టేజ్ ప్రొటెస్ట్ నిర్వహించారు.

ఈ విషయమై బీజేపీ నేత రామ్ కదం మాట్లాడుతూ ‘‘చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాహుల్ చేశారు. ఆయన దీనిపై క్షమాపణ కోరాలి. ఒకవేళ ఇప్పుడు క్షమాపణ చెప్పకపోయినా.. తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకునే రోజు వస్తుంది’’ అని అన్నారు. ఇక ఈ విషయమై ఉద్ధవ్ థాకరే వర్గాన్ని సైతం కదం ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై వారేమీ స్పందించలేదని, ఈ వ్యాఖ్యలపై వారి స్టాండ్ ఏంటో చెప్పాలని ఉద్ధవ్ వర్గాన్ని ప్రశ్నించారు.

ప్రస్తుతం కర్ణాటకలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా శనివారం తుమకూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, సావర్కర్‭లపై విరుచుకుపడ్డారు. స్వాతంత్ర్యోద్యమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏమిటని ఓ విలేకరి అడిగినపుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఆ కాలంలో బీజేపీ లేదని, స్వాతంత్ర్యోద్యమంలో ఆ పార్టీ పాత్ర ఏమీ లేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు ఆరెస్సెస్ బ్రిటిష్‌వారికి సహాయపడిందని, దామోదర్ సావర్కర్ బ్రిటిష్‌వారి నుంచి స్టైపెండ్ పొందేవారని చెప్పారు. స్వాతంత్ర్యోద్యమంలో బీజేపీ ఎక్కడా లేదన్నారు. ఆ వాస్తవాలను ఆ పార్టీ దాచిపెట్టడం సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ నేతలు స్వాతంత్ర్యం కోసం పోరాడారని రాహుల్ తెలిపారు.

Shiv Sena: పేర్లు, గుర్తులు మారుతున్నాయి.. త్రిశూలం, సూర్యుడు, కాగడ.. ఈసీ ముందు ఉద్ధవ్ వర్గం ప్రతిపాదన

ట్రెండింగ్ వార్తలు