Shiv Sena: పేర్లు, గుర్తులు మారుతున్నాయి.. త్రిశూలం, సూర్యుడు, కాగడ.. ఈసీ ముందు ఉద్ధవ్ వర్గం ప్రతిపాదన

శివసేన రెండుగా చీలిన అనంతరం ఇరు వర్గాలు ఎదుర్కొంటున్న తొలి పరీక్ష ఇదే. ఇందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. ముంబైలో శివసేను బాగా పట్టుంది. ముంబై కేంద్రంగానే శివసేన అన్ని కార్యకలాపాలు చేస్తుంది. కావున.. ముంబైలోని ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏ శివసేనకు జై కొడితే ఆ శివసేనను అసలైనదిగా భావించడానికి కొంత ఆస్కారం ఏర్పడుతుంది.

Shiv Sena: పేర్లు, గుర్తులు మారుతున్నాయి.. త్రిశూలం, సూర్యుడు, కాగడ.. ఈసీ ముందు ఉద్ధవ్ వర్గం ప్రతిపాదన

Uddhav Sena explores options after poll symbol freeze

Shiv Sena: రెండుగా చీలిన శివసేనకు ఇప్పటి వరకు ఉణ్న విల్లు-బాణం గుర్తు కాకుండా ఇరు వర్గాలకు వేరు వేరు గుర్తులు రానున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అసలైన శివసేన తామంటే తామే అని తీవ్రంగా పోటీ పడ్డ ఇరు వర్గాలు.. అంధేరీ తూర్పు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రతిపానకు అనుగుణంగా వేరు వేరు గుర్తులు తీసుకునేందుకు అంగీకారానికి వచ్చారు.

ఈ విషయమై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గం మూడు పేర్లు, మూడు గుర్తులతో కూడిన జాబితాను ఎన్నికల కమిషన్‌కు ఇచ్చినట్టు ఈసీ వర్గాల సమాచారం. పేరు పరంగా మొదటి ఛాయెస్‌గా ‘శివసేన బాలాసాహెబ్ థాకరే’, రెండో ఛాయెస్‌గా ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే’ పేర్లను ఉద్ధవ్ వర్గం ప్రతిపాదించింది. పార్టీ గుర్తుగా త్రిశూలం, రెండవ ఛాయెస్‌గా ఉదయిస్తున్న సూర్యుడు, మూడవ ఛాయెస్‌గా కాగడలను కేటాయించాలని కోరింది.

DMK Chief MK Stalin: డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక..

శివసేనకు ఈసీఐ 1989లో శాశ్వత గుర్తుగా ‘విల్లు-బాణం’ కేటాయించింది. దానికి ముందు జరిగిన ఎన్నికల్లో కత్తి-డాలు, కొబ్బరి చొట్టు, రైల్వే ఇంజన్, కప్ అండ్ ప్లేట్ గుర్తులతో శివసేన పోటీ చేసింది. కాగా శివసేన పేరు, విల్లు-బాణం గుర్తు తమవేనంటూ ఇటు ఉద్ధవ్ థాకరే వర్గం, అటు ఏక్‌నాథ్ షిండే వర్గం పట్టుబట్టడంతో పార్టీ పేరు, గుర్తును ఈసీఐ శనివారంనాడు స్తంభింపజేసింది. మూడు పేర్లు, మూడు గుర్తులు ఎంచుకుని తమకు ఇవ్వాలని, వాటిలో ఒకటి ఉభయ వర్గాలకు కేటాయిస్తామని ఈసీ తెలిపింది.

Bharat Jodo Yatra: కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర.. రాహుల్ వెంట భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు ( ఫొటో గ్యాలరీ)

శివసేన రెండుగా చీలిన అనంతరం ఇరు వర్గాలు ఎదుర్కొంటున్న తొలి పరీక్ష ఇదే. ఇందుకు మరో బలమైన కారణం కూడా ఉంది. ముంబైలో శివసేను బాగా పట్టుంది. ముంబై కేంద్రంగానే శివసేన అన్ని కార్యకలాపాలు చేస్తుంది. కావున.. ముంబైలోని ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏ శివసేనకు జై కొడితే ఆ శివసేనను అసలైనదిగా భావించడానికి కొంత ఆస్కారం ఏర్పడుతుంది.

వాస్తవానికి ఈ స్థానం శివసేనదే. శివసేన టికెట్టుపై గెలిచిన లాట్కే ఈ యేడాది మేలో మరణించారు. దీంతో తూర్పు అంధేరీలో ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా, ఈ స్థానంలో లాట్కే భార్యను నిలబెట్టే యోచనలో ఉద్ధవ్ వర్గం ఉంది. ఇక బీజేపీ-షిండే వర్గం మాజీ కార్పొరేటర్ ముర్జీ పటేల్‭ను రంగంలోకి దింపుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నిక పూర్తిగా శివసేన వర్సెస్ శివసేనగానే జరగనుంది. షిండేకు బీజేపీ మద్దతు.. ఉద్ధవ్‭కు ఎన్సీపీ మద్దతు ఉన్నాయి. ఈ స్థానాన్ని ఎవరు గెలిచి అసలైన శివసైనికులము తామేనని నిరూపించుకుంటారో చూడాలి మరి.

Karnataka: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు మంత్రిమండలి ఆమోదం