Karnataka: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు మంత్రిమండలి ఆమోదం

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ రిజర్వేషన్ల పెంపు వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం చేకూరనుందని న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి పేర్కొన్నారు. ఎస్సీలో 103 జాతులు, ఉపకులాలు, ఎస్టీలో 56 ఉపకులాలు ఉన్నాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 69 శాతం రిజర్వేషన్లను అందిస్తోందని, రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్‌ 9లోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను అనేక రాష్ట్రాలు చేస్తున్నాయని తెలిపారు

Karnataka: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు మంత్రిమండలి ఆమోదం

Karnataka Cabinet approves proposal to hike SC, ST reservation

Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను పెంచుతూ ఆ రాష్ట్ర మంత్రి మండలి శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డు న్యాయమూర్తి నాగమోహన్‌దాస్ నాయకత్వంలోని కమిటీ చేసిన సిఫారసు మేరకు ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి, ఎస్టీ రిజర్వేషన్లను 3 నుంచి 7 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అఖిలపక్ష సమావేశంలో శుక్రవారం రిజర్వేషన్ల పెంపుపై ఏకగ్రీవ తీర్మానం చేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రి మండలి సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి మీడియాతో మాట్లాడుతూ జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్‌ చాలాకాలంగా ఉందన్నారు. సామాజిక న్యాయ పరికల్పన దిశలో ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని వివరించారు. దీన్ని ఏ ఒక్కరి విజయంగానో భావించడం లేదన్నారు.
రిజర్వేషన్ల పెంపునకు ముందు న్యాయనిపుణులతోనూ, వివిధ వర్గాల ప్రజలతోనూ విస్తృతంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిజర్వేషన్ల వర్గీకరణకు ఉప సమితి రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని కూడా కొలిక్కి తెచ్చేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి నిర్ణయించింది. ఈ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా రానున్న రోజుల్లో వర్గీకరణ అంశానికి కూడా పరిష్కారం చూపనున్నారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఈ రిజర్వేషన్ల పెంపు వల్ల విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రయోజనం చేకూరనుందని న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి పేర్కొన్నారు. ఎస్సీలో 103 జాతులు, ఉపకులాలు, ఎస్టీలో 56 ఉపకులాలు ఉన్నాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసి 69 శాతం రిజర్వేషన్లను అందిస్తోందని, రిజర్వేషన్ల అంశాన్ని షెడ్యూల్‌ 9లోకి తీసుకురావాలన్న డిమాండ్‌ను అనేక రాష్ట్రాలు చేస్తున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన తీర్పు మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటరాదని, తాజాగా రిజర్వేషన్ల పెంపు వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తవని స్పష్టం చేశారు.

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి నరేంద్రమోదీ ట్వీట్..