DMK Chief MK Stalin: డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక..

డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

DMK Chief MK Stalin: డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక..

DMK Chief MK Stalin

DMK Chief MK Stalin: డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు డీఎంకే ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా డీఎంకే నేతలు దురై మురుగన్, టీఆర్‌బాలు ఎన్నికయ్యారు. ముగ్గురు నేతలు రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు. సాధారణ కౌన్సిల్ సమావేశంకు హాజరయిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

YCP Leader Murder Case: హిందూపురం వైసీపీ నేత దారుణ హత్య.. ఎమ్మెల్సీ పీఏతో సహా ఐదుగురిపై కేసు నమోదు

డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పార్టీ పదవులకు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నుకున్నారు. దివంగత పార్టీ వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్. డీఎంకె కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పార్టీ పదవులను నిర్వహించారు. 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డీఎంకే 1949లో స్థాపించబడింది. కరుణానిధి 1969లో డీఎంకేకు తొలి అధ్యక్షుడిగా ఎన్నికై తొలిసారిగా పార్టీలో అధ్యక్ష పదవిని సృష్టించారు. ద్రవిడ ఉద్యమ చిహ్నం, డీఎంకె వ్యవస్థాపకుడు సీఎన్ అన్నాదురై పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1969 నుంచి మరణించే వరకు అధ్యక్ష పదవిలో కరుణానిధి ఉన్నారు.