Free Ration Scheme: రేషన్ షాపుల్లో మోడీ, కమలం ఫోటోలు.. రాష్ట్రాలకు బీజేపీ సూచనలు!

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న కేంద్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు కమలం పువ్వు గుర్తుతో కూడినబ్యానర్‌లను ఏర్పాటు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను కోరింది భారతీయ జనతా పార్టీ.

PM Modi Free Ration Scheme : ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఉచిత రేషన్ పంపిణీ చేస్తున్న కేంద్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రాలతో పాటు కమలం పువ్వు గుర్తుతో కూడినబ్యానర్‌లను ఏర్పాటు చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను కోరింది భారతీయ జనతా పార్టీ. రేషన్ సంచులపై కూడా తామరపువ్వు కనిపించేలా పెట్టాలని సూచించారు.

COVID-19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో పేదలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించడానికి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద ఈ సంవత్సరం జూన్ వరకు రెండు నెలల పాటు.. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) పరిధిలోకి వచ్చే 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు నెలకు ఐదు కిలోల ఆహార ధాన్యాన్ని ఉచితంగా అందించారు. ఇప్పుడు ఈ పథకాన్ని నవంబర్ చివరివరకు పొడిగించారు.

బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈమేరకు లేఖలు రాశారు. అయితే, ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ చిత్రం పెట్టడంపై చర్చ జరుగుతూ ఉండగా.. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం సూచనలు ప్రతిపక్షాలు విమర్శలు చెయ్యడానికి మరింత ఊతం ఇచ్చినట్లుగా అవుతుంది అనే వాదన కూడా ఉంది.

ఇప్పటికే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తమ ముఖ్యమంత్రుల ఫోటోలను వ్యాక్సిన్ సర్టిఫికేట్ పత్రాలపై ముద్రించాయి. ఇటువంటి పరిస్థితిలో రేషన్ షాపులలో ప్రదర్శించాల్సిన బ్యానర్ రూపకల్పనను కూడా బీజేపీ కేంద్ర కార్యాలయమే సెట్ చేసి, రాష్ట్ర శాఖలకు సూచనలు ఇచ్చింది. రేషన్ సంచులలో సరుకులను ఇస్తోండగా వాటిపైనే ఈ ఫోటోలు కనిపించాలి అనేది బీజేపీ ఉద్ధేశ్యం.

ట్రెండింగ్ వార్తలు