Black Fungus Declared Epidemic In Jharkhand
Black fungus: జార్ఖండ్ గవర్నమెంట్ బ్లాక్ ఫంగస్ ను మహమ్మారిగా ప్రకటించినట్లు సీఎంఓ మంగళవారం వెల్లడించింది. జార్ఖండ్ తో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖాండ్ రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే నమోదవుతున్నాయి.
జార్ఖండ్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను జూన్ 17వరకూ పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర నిబంధనలతో పాటు రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులకు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ ఆదేశించింది. దాంతో పాటు అంతర్రాష్ట్ర బస్సులతో పాటు ఇంటర్సిటీ బస్ సర్వీసులను కూడా సస్పెండ్ చేసింది.
పెళ్లిళ్లకు కేవలం 11మంది మాత్రమే హాజరు కావాలంటూ కండిషన్ పెట్టింది.
మ్యూకోర్మికోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనే ఈ సమస్య మ్యూకోర్మిసీటిసీ గుంపుల కారణంగా వస్తుంది. ఇవి సహజంగానే వాతావరణంలో ఉంటాయి. ముక్కు, కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. షుగర్ పేషెంట్లు ఈ సమస్య రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు అంటున్నారు.