Tamil Nadu Blast : తమిళనాడులో భారీ పేలుడు.. 17మంది మృతి..

విరుదునగర్ పేలుడు ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ఆయన కలెక్టర్ తో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.

  • Updated on- April 19, 2026 / 06:04 PM IST

Tamil Nadu Blast : తమిళనాడు విరుదునగర్ లో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

విరుదునగర్ పేలుడు ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటనపై ఆయన కలెక్టర్ తో మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు.

Also Read: బాబ్ అల్ మాండెబ్ జలసంధి.. భారత్ కు ఎందుకంత కీలకం.. క్లోజ్ అయితే కలిగే నష్టం ఏంటి?